వృద్ధి రేటులో, దేశంలో రెండో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh ranks second in the country in terms of growth rate

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల్లోనే లక్ష కోట్ల అప్పు చేసేసింది, ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలయిపోయింది, యువత లో కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ఇలా ఎన్నో ఆరోపణలు, ప్రచారాలు, వైసీపీ చేస్తోంది.

ఈ మధ్య జరిగిన రెండు పరిణామాలు , ఇవి తప్పు అని రుజువు చేసాయి.

కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో , 2 స్థానాల్లోనూ టీడీపీ ఘనవిజయం సాధించింది. యువత కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారన్న ప్రచారం , విఫలం అయింది.

అయితే , ఇన్నాళ్లు ఈవీఎం లు మేనేజ్ చేసి, టీడీపీ గెలిచింది, అని తప్పుడు ప్రచారం చేస్తూ వున్నవైసీపీ, బ్యాలట్ పేపర్ ద్వారా పోటీ చేసి , విజయం సాధించి, తమ ఆరోపణలు నిజమే అని నిరూపించచ్చు కదా, కానీ ఆలా చెయ్యలేదు, బ్యాలట్ పేపర్ ద్వారా జరిగిన ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో , అసలు పోటీ చెయ్యకుండానే చేతులెత్తేసింది.

అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం, 2024-25 ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల వృద్ధి రేటు గణాంకాలు (GDP ), విడుదల చేసింది , మొదటి స్థానంలో తమిళనాడు ఉంది. రెండవ స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ వుంది.

తమిళనాడు 9.18% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 8.21% వృద్ధి రేటుతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.

కేంద్రం ఈ గణాంకాలను , జీఎస్డీపీ డేటాను తీసుకుని అంచనా వేస్తుంది. ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల మొత్తం విలువ జీఎస్డీపీ.

దీనికి కారణం చూస్తే

పెట్టుబడులు పెరగడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ (speed of doing business అని లోకేష్ అంటున్నారు ), పారిశ్రామిక విధానాల్లో సంస్కరణలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు నిర్ణయాలు, ఈ జీడీపీ గ్రోత్ కు, దోహదపడుతున్నాయి. 10 నెలల్లోనే ఈ రేట్ సాధిస్తే, ఇంకో రెండేళ్లలో, ఈ ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడును కూడా మించిపోతుంది. 2014-19 మధ్య కూడా ఏపీ అభివృద్ధిలో పరుగులు తీసింది. కానీ వైసీపీ వచ్చాక పూర్తిగా నిర్వీర్యమయింది.

ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయి, ఆంధ్ర ప్రదేశ్ వార్తల్లోకి ఎక్కడం, వైసీపీ నేతలకు నచ్చడం లేదు. ఈ వార్తలు, ఈ గణాంకాలు ఫేక్ అంటున్నాయి.

కేంద్రం అలా ఫేక్ నెంబర్లు ఇవ్వాలంటే, మొదటి స్థానం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకదానికి ఇచ్చివుండేవారే కదా, ఆ మాత్రం సోయి కూడా వారికి ఉండటం లేదు.

ఈ విషయం పై కౌంటర్ ఇవ్వాలంటే, మాజీ ఆర్ధికమంత్రి , వైసీపీ కి చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ అయినా, మీడియా ముందుకు రావాలి కదా, మరి ఆయన ఎందుకు రావడం లేదో అర్ధం కావట్లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *