తెలుగు వెబ్ న్యూస్
Telugu Web News

చాగంటి గారికి తిరుమల లో అవమానం జరిగిందా ?

1

జరిగింది , అని సోషల్ మీడియా లో  వార్తలు వచ్చాయి. కొన్ని యూట్యూబ్ చానెళ్లు ప్రసారం చేశాయి.

అసలు జరిగింది ఏమిటి ?

ప్రతిసంవత్సరం, చాగంటి గారు, తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా జనవరి 14 వ తేదీన అలాగే వచ్చారు. చాగంటి గారి రాక సందర్భంగా 16వ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు, దానికి . టీటీడీ అధికారులు డిసెంబర్ నెల 20వ తేదీన వుత్తర్వులు ఇచ్చారు.

టిడిపి కూటమి ప్రభుత్వం చాగంటి కోటేశ్వర రావు గారిని, ప్రభుత్వ సలహదారుడిగా(నైతిక విలువల కమిటీ ) నియమించడం వల్ల, ఆయనకు కేబినేట్ ర్యాంక్ ఉండటం వల్ల ప్రొటోకాల్ ప్రివిలేజ్ వుంటుంది. దాని ప్రకారం 14వ తేదీన శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేశారు టీటీడీ అధికారులు. ఇందులో భాగంగా ఆయన బస చేసిన రామ్ బగీచ గెస్ట్ హౌస్ నుండి శ్రీవారి ఆలయానికి ఆయనను తీసుకెళ్లడానికి బగ్గీ, శ్రీవారి ఆలయానికి , డైరెక్ట్ గా వెళ్ళడానికి, బయోమెట్రిక్ ద్వారా అనుమతి ఇచ్చారు.

ఆ బగ్గీ ని వద్దని, కాలినడకనే ఆలయానికి వెళ్తానని చాగంటి గారు చెప్పారు, అలాగే తనకు ప్రోటోకాల్ ప్రీవిలేజ్ ప్రకారం, శ్రీవారి ఆలయానికి డైరెక్ట్ గా, బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్నప్పటికీ ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. తాను కూడా సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి, క్యూ లోనే, చేరుకుంటానని టీటీడీ అధికారులకు చెప్పిన చాగంటి గారు, చెప్పిన మేరకే ఆయన స్వయంగా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఆలయానికి క్యూ లోనే చేరుకుని ,  శ్రీవారిని దర్శించుకున్నారు.

జరిగింది ఇలా వుంటే, ఈ విషయం లో చాగంటి గారికి, ప్రోటోకాల్ ఇవ్వకుండా, ఒక సాధారణ భక్తుడిగా ఆయనకు దర్శనం కల్పించి, టీటీడీ అధికారులు ఆయనను అవమానించారని, కొన్ని యూట్యూబ్ చానెళ్ళు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయి.

అలాగే టీటీడీ అధికారులు, జనవరి 16 న,తిరుపతి లో జరగాల్సిన చాగంటి గారి ప్రవచన కార్యక్రమాన్ని, కూడా రద్దు చేసి, ఆయన్ని అవమానించారని కూడా ఈ చానెళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయి.

కాని అసలు జరిగిందేమిటి ?

జనవరి 8 తేదీన, తిరుపతి లో తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. ఈ దుర్ఘటన జరిగిన తరువాత, తిరుపతికి, సిఎం ,డిప్యూటీ సిఎం లు రావడంతో, అధికారులంతా, తదుపరి చర్యలు తీసుకోవడంలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు . దీన్ని దృష్టిలో పెట్టుకుని , టీటీడీ అధికారులు, ఇలాంటి వాతావరణం లో కార్యక్రమం పెట్టడం సబబు కాదు, ప్రవచన కార్యక్రమాన్ని మరొక తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని ఆయనకు విజ్ఞప్తి చేశారు, దానికి ఆయన అంగీకరించారు. ఆ విధంగా ఆ ప్రవచన కార్యక్రమం రద్దయింది.

జరిగిన వాస్తవాలు ఇవి అయితే, ఈ ప్రవచన కార్యక్రమం రద్దు విషయం లో కూడా చాగంటి గారిని, టీటీడీ అవమానించిది అని, కొన్ని యూట్యూబ్ చానెళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయి.

వాస్తవాలను వక్రీకరించి అసత్యపు వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ఇప్పుడు దీనికి అనుగుణంగా చట్టపరమైన చర్యలకు దిగారు. టీటీడీపై, తిరుమల ఆలయంపై తప్పుడు ఆరోపణలు చేశారని, తప్పుడు వార్తలు ప్రసారం చేశారని, మూడు యూట్యూబ్ ఛానల్స్, డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్..పై చర్యలు తీసుకోవాలని టీటీడీకి చెందిన పురాణ, ఇతిహాసాల ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఏవీఎస్‌ఎస్‌ విభీషణ్‌ శర్మ, తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వీ యూనివర్శిటీ పోలీసులు ఆ మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు (నంబర్ 13/2025) నమోదు చేశారు.

వారిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో పాటు న్యూఢిల్లీ, విజయవాడలో గల ప్రెస్ ఇస్పర్మెషన్ బ్యూరో, లైసెన్స్ లను రద్దు చేయాలని యూట్యూబ్ మెటా మేనేజ్మెంట్‌కూ ఫిర్యాదు చేసినట్లు, టీటీడీ అధికారులు వివరించారు.

 

1 Comment
  1. Kameswari Dhulipala says

    Thanks for atleast giving us the correct information

Leave A Reply

Your email address will not be published.