తెలుగు వెబ్ న్యూస్
  • వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్
No Result
View All Result
తెలుగు వెబ్ న్యూస్
No Result
View All Result
Home Media watch

సాక్షి ఛానెల్ మూతపడనుందా ?

by dasaradh2009@gmail.com
June 27, 2025
0
will sakshi channel be closed ?
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

1st March 2025.

 

ఇప్పుడు మన దేశంలో చాలా వరకు, ప్రతి పార్టీకి అనుకూల పత్రికలు, శాటిలైట్ టీవీ చానెళ్లు వున్నాయి, ఉంటాయి, అది సహజమే. కానీ, ఒక పార్టీనే ఒక దినపత్రిక, ఒక ఛానెల్ పెడితే? అదే సాక్షి న్యూస్ పేపర్,  సాక్షి టీవీ ఛానల్.

2004లో వైస్సార్ సీఎం అయిన తరువాత ఆ 2 పత్రికలు అని విమర్శించేవారు, అంటే అవి ఈనాడు, ఆంధ్ర జ్యోతి పేపర్లు.

కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక పేపర్, టీవీ ఛానల్ ఉండాలని, సోనియా ను కూడా ఒప్పించి, సాక్షి పేపర్, టీవీ ఛానల్ పెట్టించారు. అయితే, జగన్ అవినీతి సిబిఐ, ఈడీ కేసుల సందర్భంగా, సిబిఐ పేర్కొన్న క్విడ్ ప్రో ద్వారానే, ఈ సాక్షి లో అవినీతిపరులు పెట్టుబడులు పెట్టారని, అది పత్రిక కాదు, అవినీతి విష పుత్రిక అని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూ వుంటారు.

క్విడ్ ప్రో అంటే, జగన్ తండ్రి వైస్సార్ 2004 నుండి 2009 వరకు సీఎం గా వున్నపుడు, జగన్ స్థాపించిన, మీడియా,కంపెనీలకు, అలాగే కొన్ని షెల్ కంపెనీలకు, కొంతమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెడితే, ఆ పారిశ్రామిక వేత్తలకు, రాష్ట్ర ప్రభుత్వ వనరులు లేదా సంపద, ఉచితంగా లేదా చాలా తక్కువ ధరకు అప్పటి వైస్సార్ ప్రభుత్వం కట్టబెట్టింది, అని. వీటిమీదే, జగన్ పై, సిబిఐ ,ఈడీ కేసులు పెట్టారు, ఇప్పటికీ ఆ కేసులు నడుస్తున్నాయి

ఎల్లో మీడియా చానెళ్లు అని ABN,TV5 ని వైసీపీ నాయకులు ,అభిమానులు తిడుతూ వుంటారు, కానీ వాళ్ళు తెలుసుకోవలిసింది ఏమిటంటే, సాక్షి ఛానల్ లో చంద్రబాబు సీఎంగా వున్నపుడు కానీ, ప్రతిపక్ష నాయకుడిగా వున్నపుడు కానీ, అయన లైవ్ స్పీచెస్ , వీడియో క్లిప్పింగ్స్  అస్సలు రాలేదు, రావు. అంతెందుకు జగన్ చెల్లెలు షర్మిలే స్వయంగా అన్నది, ఆమె సంభందించిన న్యూస్ గాని, స్పీచెస్ గాని , సాక్షిలో రావు అని.  కానీ, ABN,TV5 లో జగన్ లైవ్ స్పీచెస్ వస్తాయి, వీడియో క్లిప్పింగ్స్ కూడా వస్తాయి, కానీ వైసీపీ వాళ్ళు ఇది గుర్తించరు.

ABN, టీడీపీ కి అనుకూలమైన ఛానల్ అంతే కానీ, వైసీపీ స్వంత ఛానెల్ అయిన సాక్షి లా, ABN కాదు., అది టీడీపీ స్వంత ఛానల్ కాదు. ABN లో ఏమి రావాలో, RK ఎలా మాట్లాడాలో, టీడీపీ ఏమి రోజు రాసి పంపించదు, పంపించినా వాళ్ళు వినరు.  అది ABN మరియు RK ఇష్టం. ABN లో ఏది వచ్చినా, అది టీడీపీ కి గాని చంద్రబాబు కు అంటగట్టడం తప్పు.  అసలు కొన్ని సార్లు RK రాతల వలన టీడీపీ వాళ్ళు ఇబ్బంది పడ్డ, చిరాకుపడ్డ సందర్భాలు కూడా వున్నాయి

సాక్షి పేపర్లో టీడీపీ కి వ్యతిరేకంగా ఎన్నో అబద్ధపు వార్తలు వస్తూ ఉంటాయి అని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూ వుంటారు.

కొద్ది కాలం క్రితమే తీసుకుంటే, 2014 నుండి 2019 వరకు చంద్రబాబు సీఎం గా ఉన్నంత వరకు , సాక్షి పేపర్ ఛానెల్, పేపర్ ఎన్నో అబద్దాలు రాసేది.

టీటీడీ పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో వెతికితే దొరుకుతుంది అని, పోలవరం ప్రాజెక్ట్ వ్యయం ,2013 భూసేకరణ చట్టం ప్రకారం, పునరావాసానికి, ప్రాజెక్ట్ కు కలిపి 55,000 కోట్లు అవుతుందని , ఆ వ్యయం కేంద్ర ప్రభుత్వం భరించాలి అని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే, పోలవరం ప్రాజెక్ట్ లో చంద్రబాబు దోచుకోడానికి, ఇలా అంచనాలు పెంచారని సాక్షి చెప్పింది, తీరా చూస్తే జగన్ 2019 లో సీఎం అయ్యాక, ఇవే 55,000 కోట్లు పోలవరానికి ఇప్పించాలని కేంద్రానికి రాసింది.

అలాగే 2019 ఎన్నికల ముందు, వైస్సార్ తమ్ముడు, వివేకానంద రెడ్డి హత్య జరిగితే, మరునాడే, సాక్షి పేపర్ మొదటి పేజీ లో చంద్రబాబు చేతిలో ఒక రక్తమోడుతున్న కత్తిని పెట్టి, నారాసుర రక్త చరిత్ర అని రాసి, వైస్సార్ తండ్రి రాజారెడ్డిని, వైస్సార్ ను, అలాగే వివేకాను కూడా చంద్రబాబే హత్య చేయించనట్టు ఫోటో పెట్టి రాసారు . మరి చంద్రబాబు ఎందుకు సాక్షి మీద అప్పుడు పరువు నష్టం దావా వెయ్యలేదో అర్ధం కాదు. చంద్రబాబు మెతక వైఖరి, ఆయనకే కొన్ని సార్లు చేటు తెస్తుందని, టీడీపీ నాయకులే , అసంతృప్తి వెళ్లగక్కుతూ వుంటారు.

ఇలా ఎన్నో.

అలాగే జగన్ 2019 నుండి 2024 వరకు జగన్ సీఎం గా వున్నపుడు, రాష్ట్రంలో చాలా చోట్ల ABN, TV5 చానళ్ళు రాకుండా, నిషేదించారు.

ఇలాంటి అరాచాకాలు భరించలేక, ప్రజలు, వైసీపీ ని ఘోరంగా ఓడించి ,11 ఇచ్చాక, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా , సాక్షి మళ్ళా అబద్దాల వార్తలు మొదలు పెట్టింది.

ఒక ఉదాహరణ తీసుకుంటే,

రామోజీరావు మరణించిన తరువాత అయన సంస్మరణార్థం, 2024 లో చంద్రబాబు ప్రభుత్వం విజయవాడ లో రామోజీ సంస్మరణ సభ ఏర్పాటు చేస్తే, ఈ సభకు 13 కోట్లు ప్రజల డబ్బు ఖర్చుపెట్టారని. సాక్షి చెప్పింది, కానీ ఈ సభకు అయ్యింది కోటి, 80 లక్షలు ఖర్చు మాత్రమే. కానీ, ఇదే సభలో సభలో, రామోజీ గ్రూప్, అమరావతి నిర్మాణానికి 10 కోట్లు విరాళం ప్రకటించారు, కానీ ఈ విషయం మాత్రం సాక్షి చెప్పలేదు.

అలాగే, కొద్దిరోజుల క్రిందట, అసెంబ్లీ లో, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కొత్తగా ఎన్నికైన చాలా మంది శాసనసభ్యులకు , శాసనసభలో ప్రవర్తించాల్సిన తీరు, రూల్స్ పై అవగాహన కల్పించడానికి ఒక ట్రైనింగ్ క్యాంపు నిర్వహించాలనుకుని, దానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కూడా ఆహ్వానించాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఆ క్యాంపు జరగలేదు.

కానీ , ఈ క్యాంపు కు కొన్ని కోట్ల ప్రజల డబ్బు ఖర్చుపెట్టారని సాక్షి ప్రసారం చెయ్యడంతో, అయ్యన్న పాత్రుడు, ఆగ్రహించారు, జరగని ట్రైనింగ్ క్యాంపు కు, డబ్బు ఎలా ఖర్చు అవుతుందని, సాక్షి ఎలా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నదో, ఈ సంఘటన ను ఉదహరించి, అసెంబ్లీ లో చెబుతూ, సాక్షి కి నోటీసు లు ఇచ్చి, చర్యలు తీసుకోవాలని తలచారు.

ఇలా టీడీపీ మీద, చంద్రబాబు మీద ఎన్నో అసత్య వార్తలు రాస్తూ, టీడీపీ ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్న, విషం చిమ్ముతున్న, ఈ సాక్షి ఛానల్ ను రద్దు చేయించాలని, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇది అంత సులభమా ?

ఒక శాటిలైట్ టీవీ ఛానల్ పెట్టాలంటే, దాదాపు 2 కోట్లు చెల్లించి, కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖకు లైసెన్స్ గురించి దరఖాస్తు చెయ్యాలి. ప్రస్తుతం ఈ సమాచార శాఖ కూడా ,కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా దగ్గరే ఉన్నట్టు తెలుస్తోంది.

2019 నుండి 1000 కి పైగా కొత్త చానెళ్లు దరఖాస్తు చేస్తుకుంటే, 2 చానెళ్లకు మాత్రమే లైసెన్స్ ఇచ్చారట. ఈ లెక్కన కొత్త ఛానల్ లైసెన్స్ పొందాలంటే చాలా కష్టం. అందుకే కొత్తగా చానెళ్లు పెడదామనుకునేవారు, ఆల్రెడీ లైసెన్స్ పొంది, ఛానల్ నడపలేకపోయిన వాళ్ళ దగ్గరనుండి బ్లాక్ లో ఈ లైసెన్స్ లు కొనుక్కుంటారట, కొన్ని సార్లు ,వాళ్ళ దగ్గరనుండి లీజ్ కు కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఒక ఛానెల్ లైసెన్స్ పొందడం ఎంత కష్టమో, లైసెన్స్ రద్దు చెయ్యాలన్న అంత కష్టం, చాలా ప్రాసెస్ ఉంటుంది.

ప్రస్తుతం సాక్షి ఛానల్ రద్దు ఫైల్ అమిత్ షా దగ్గర ఉందని చెబుతున్నారు.

సాక్షి టీవీకి అనుమతులను కేంద్రం రెన్యూవల్ చెయ్యలేదు, . హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఛానల్ మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే సాక్షి ఛానెల్ పదిహేను మంది ఉద్యోగుల పేర్లతో హైకోర్టు లో పిటిషన్ వేయించింది, ఛానెల్ మూసేస్తే ఆరు వందల మంది రోడ్డున పడతారని ఆ పిటిషన్ లో పేర్కొంది. కేంద్ర హోమ్ శాఖ తమ ఛానెల్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవడానికి తగిన కారణాలు చెప్పలేదని, ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దేశ భద్రతకు సంబంధించి కొన్ని అంశాలను బయట పెట్టలేమని కేంద్రం చెబుతోంది.

కేంద్రం చెప్పే సమాధానంతో హైకోర్టు సంతృప్తి పడితే.. కేంద్రం ఆదేశాలను అమలు చేయాలనిహై కోర్ట్ కనుక తీర్పు ఇస్తే, సాక్షి టీవీ మూత తప్పదు.

టీడీపీ కూటమి వత్తిడితో , సాక్షి ఛానెల్ లైసెన్స్ పొడిగించలేమని కేంద్రం పట్టుబడితే, హై కోర్ట్ కూడా సాక్షి కి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, అపుడు సాక్షి ఛానల్ ,సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించే అవకాశం వుంది. అక్కడ మాత్రం, సాక్షి కి అనుకూలంగా తీర్పు వస్తే, మరిక సాక్షి ఛానల్ ను, ఎవ్వరు మూసేయించలేరు. సాక్షి కి వ్యతిరేకంగా తీర్పు వస్తే, మాత్రం, ఇక సాక్షి ఛానల్ శాస్వితంగా మూతపడకతప్పదు.

 

ShareTweet

Related Posts

patri vasudevan terminated from 99tv

జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….

eenadu case against sakshi

ఈనాడు సాక్షి పై వేసిన పిటిషన్ లో , హై కోర్ట్ ఏమని తీర్పు ఇచ్చింది?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

No Result
View All Result

Recent Posts

  • లోకేష్ రెడ్ బుక్ కు నా ఇంటి కుక్క కూడా భయపడదు, అని పదే, పదే ,అంటున్న అంబటి రాంబాబు , ఇప్పుడు జైలు కు వెళ్తున్నాడు.
  • జగన్ సీఎంగా వున్నపుడు , తన పై బాస్ కే మెమో పంపిన ప్రవీణ్ ప్రకాష్ , హఠాత్తుగా ఎందుకు ఏబివి కి , జాస్తి కిషోర్ కు క్షమాపణలు చెప్పాడు ?
  • తిరుమలలో , కల్తీ నెయ్యి స్కాం జరగలేదు….ఎందుకంటే అది అసలు నెయ్యే కాదు….విస్తుపోయే వాస్తవాలు
  • లిక్కర్ స్కాం లో ప్రస్తుతం జైల్లో వున్న, నోట్ల కట్ల సెల్ఫీ వీడియో తో దొరికిపోయిన వెంకటేష్ నాయుడు ది, వైసీపీ పార్టీ కాదా ?
  • జర్నలిస్ట్ పత్రి వాసుదేవన్ ను, తమ ఛానల్ నుండి తొలగించిన 99టీవీ…….

Archives

తెలుగు వెబ్ న్యూస్

Copyright © 2017 JNews.

Navigate Site

  • Privacy
  • About Us
  • Policy
  • Terms and conditions
  • Terms & Conditions
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us
  • Site Map

Follow Us

No Result
View All Result
  • వార్తలు
  • రాజకీయాలు
  • బ్లాగ్
  • విశ్లేషణ
  • మీడియా వాచ్
  • సినిమాలు
  • వీడియోలు
  • హోమ్

Copyright © 2017 JNews.