26 February 2025.
హైదరాబాద్ , రాయదుర్గం లో, మైహోం భూజాలో నివాసం ఉంటున్న(వల్లభనేని వంశీ కూడా ఇదే అపార్ట్ మెంట్ లో ఉండగా అరెస్ట్ చేసారు ) పోసాని పోసాని కృష్ణమురళిని ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చిన రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్ట్ సందర్భంగా నోటీసులు తీసుకోకుండా పోసాని హడావిడి చేసినా, బన్నీ, నిక్కర్ మీదనే వుండి అలాగే వస్తానని గొడవ చేసినా, చివరకు పోలీస్ లకు తలవొగ్గక తప్పలేదు. ఆంధ్ర ప్రదేశ్ లో రాజంపేట పోలీస్ స్టేషన్ కు పోసానిని తరలించి విచారించారు. విచారణ పూర్తి చేసి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరించారు.
పోసానికి రిమాండ్ విధించాలా వద్దా అని, తెల్లవారుఝాము వరకు వాదనలు జరిగాయి. పోలీస్ లు పోసాని వాడిన అసభ్య పదజాలం వీడియోలు చూపించారు. న్యాయమూర్తి పోసానికి 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.
ఈ అరెస్ట్ తో , పోసాని పాపం పండిందని, జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేసారు. జీ వి రెడ్డి రాజీనామా తో టీడీపీ కార్యకర్తలలో నెలకొన్ని వున్న అసంతృప్తిని డైవర్ట్ చెయ్యడానికి ఇది చేసారని, కొంతమంది రాజకీయ విశ్లేషకులు టీడీపీ డిబేట్ లలో చెప్పారు.
2022 లో వైసీపీ అధికారంలో వున్నప్పుడు , హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోసాని కృష్ణ మురళి, ప్రెస్ మీట్ పెట్టినపుడు, అంతకు ముందు తాను , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే, ఎంతో మంది జనసేన అభిమానులు తనకు ఫోన్ చేసి, తనను ,తన భార్యను బండ బూతులు తిట్టారని, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, ఇదంతా పవనే దగ్గరుండి చేయిస్తున్నాడని, అందుకే ఈ రోజు పవన్ ను ప్రశ్నిస్తున్నానని , మాట్లాడుతూ, ఆ సందర్భం లో పవన్ను, పత్రికలలో రాయలేని అసభ్య బాష లో, సామాన్య జనం వినలేనంత గా పచ్చిగా బూతులు తిట్టాడు.
పవన్ కు కూడా కూతురు ఉందని, ఆమె పెద్దయ్యేటప్పటికి తాను బ్రతికే ఉంటానని, అప్పుడు నువ్వు రక్త కన్నీరు పెట్టుకునేలా చేస్తానని , అని దారుణమైన వ్యాఖ్యలతో పవన్ ను హెచ్చరించారు . (ఈ వ్యాఖ్యలతో, పోసాని పై పోక్సో చట్టం కేసు కూడా పెట్టచ్చు అని విశ్లేషకుల భావన )
పోసాని కృష్ణమురళి , ” అమరావతి దగ్గర లోకేష్ భూమి కొన్నారు “, అని చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ ఓ కేసుకూడా వేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన బూతులతో విరుచుకుపడేవారు. 2019 ఎన్నికలకు ముందు అయన నారా లోకేష్ ను ఎన్ని తిట్లు తిట్టారో చెప్పాల్సిన పని లేదు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నోటికి హద్దూ అదుపూ లేకుండా పోయింది.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లపై వారి ఇంట్లో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని కూడా వదిలి పెట్టకుండా తిట్టేవారు. టీడీపీ గెలిచిన తర్వాత కూడా ఆయన మాట్లాడారు. ఏం పీక్కుంటారో పీక్కోమన్నారు.
గుంటూరు జిల్లాలో పెదకాకాని గ్రామంలో జన్మించిన పోసాని, పీజీ చేసిన తరువాత చెన్నై వెళ్లి, పరుచూరి శిష్యరికం చేసి, రచయితగా మొదలు పెట్టి, తరువాత ఎన్నో చిత్రాలకు, మంచి కదా రచయితగా పని చేసి, పేరు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాలు డైరెక్ట్ కూడా చేసారు.
2009 లో ప్రజారాజ్యం పార్టీ లో చేరి, చిరంజీవి టికెట్ ఇవ్వడంతో, గుంటూరు జిల్లా లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి, కేవలం 7,0000 ఓట్లు తెచ్చుకుని ఘోరంగా ఓడిపోయారు.
1999 లో చంద్రబాబు మంచి అభివృద్ధి చేస్తున్నాడని, పేపర్ లో ఫ్రంట్ పేజీ ఫుల్ యాడ్ ఇచ్చిన పోసాని, తరువాతి కాలంలో, అదే చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు, చంద్రబాబు ది నీచరాజకీయం అని, నాలుక మడతపెట్టేసాడు.
మాటిమాటికీ నేను తెలుగు లో M.A, M.Phil చేసానని చెప్పుకునే ఈ పోసాని, ఒకప్పుడు సినిమాల్లో మంచి రచయితగా పేరుగాంచిన పోసాని, వైసీపీ లో జాయిన్ అయిన తరువాత, సహవాస దోషం కాబోలు , దిగజారిపోయి కేవలం , FDC Chairman పదవి ఇచ్చి, నెలకు 2.8 లక్షల జీతం ఇచ్చిన జగన్ ను మెప్పించడానికి , పవన్, లోకేష్, చంద్రబాబులు ఎంతగా తిడితే జగన్ దగర అని మారులు పడతాయన ఉదేశంతో నోటికి అదుపూ లేకుండా విరుచుకుపడేవారు.
సైకో వెధవా, దరిద్రపు…, దొంగ….., లోఫర్ …, బేవార్స్ …, తాగుబోతు…, తిరుగుబోతు, ఆంబోతు… ఇవనీ పోసాని తిట దండకంలో ప్రతీ సారీ సర్వసాధారణం.
2015 లో ఆగిపోయిన నంది అవార్డులను చంద్రబాబు ప్రభుత్వం పునరుద్ధరించి,ఒక కమిటీ వేసి, అవార్డులు ప్రకటిస్తే, ఆ కమిటీలో 90% కమ్మవాళ్లే వున్నారని, కులం జబ్బు కూడా అంటించాడు. విచిత్రం ఏమిటంటే, అప్పుడు, టెంపర్ సినిమాలో క్యారెక్టర్ కు, ఉత్తమ క్యారెక్టర్ అవార్డు పోసానికి ఇచ్చినా, వైసీపీ మాయలోపడి , ఆ అవార్డుల కమిటీని అనరాని మాటలని దూషించాడు.
కూటమి అధికారంలోకి వచ్చాక, విమర్శల డోస్ తగ్గించినా, గతంలో అసభ్య పదజాలం వాడిన, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ , జైల్లో పెట్టేసరికి, తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయం తో, పోసాని ఒక ప్రెస్ మీట్ పెట్టి, తాను రాజకీయాల్లోనుండి తప్పుకుంటున్నాను, ఇక ఏ పార్టీ తరుపున, జీవితం లో మాట్లాడను, అని చెప్పారు. ఇక తాను రాజకీయాల్లో లేనని కుటుంబం కోసం నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు.
కానీ, తప్పు చేసి, ఇక నేను బుద్ధి జీవిగా మారిపోయాను అంటే చట్టం ఊరుకోదుగా, లోకేష్ రెడ్ బుక్ ఊరుకోదుగా, అందుకే ఇప్పుడు పోసాని అరెస్ట్, జైలు కు వెళ్లడం జరిగింది.
పోసాని అరెస్ట్ ను సామాన్య జనం ఎవ్వరు వ్యతిరేకించక పోగా, హర్షిస్తున్నారు. కానీ వైసీపీ నాయకులు మాత్రం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకుంటున్నారు అని అడ్డగోలుగా పోసాని ని సమర్ధించటం , హాస్యాస్పదం ఉందని, పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడు, మరో బూతుల రాయడు వంశి ని పరామర్శించినట్టే, పోసాని ని కూడా, రాయచోటి జైల్లో జగన్ … పోసానిని పరామర్శిస్తాడో లేదో చూడాలి.