వైజాగ్‌ టెస్టులో యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ

Yashasvi Jaiswal hits double century in Vizag Test

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీతో మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట అద్భుతంగా ఆడిన జైస్వాల్ ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఇంగ్లీష్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న జైస్వాల్ ఫోర్లు, సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌లో కెరీర్‌లో రెండో సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచాడు. జైస్వాల్ విధ్వంసం ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది.పెను విధ్వంసం సృష్టించాడు. 179 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటలో బరిలోకి దిగిన జైస్వాల్ ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *