గత 5 ఏళ్ళు IPAC టీం , జగన్ సీఎం గా వున్నపుడు, ఎన్నో డ్రామాలు ఆడి దొరికిపోయారు.
విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో , ఇదే IPAC ఆర్టిస్ట్స్ చేత , సూట్ ,బూటూ వేయించి, పారిశ్రామిక వేత్తలుగా వేషాలు వేయించారు.
తీరా భోజనాల దగ్గర వాళ్ళు ఎగబడి కొట్టుకోవడంతో , వాళ్ళ వేషాలు బయటపడి, నవ్వుల పాలు అయి, ట్రోల్స్ కు గురి అయ్యారు.
అప్పట్లో, జగన్ను అరెస్టు చేసినప్పుడు నాలుగేళ్ల పిల్ల అన్నం మానేసిందని సాక్షిలో లేఖలు ప్రచురించేవారు. కొన్ని కొన్ని, పిల్లలతో మాటలు మాట్లాడించేవారు. అసలు వారికి రాజకీయం.. అరెస్టు అంటే తెలుసా?.అయినా జగన్ టీం , ఇలాంటి నాటకాలు మానుకోలేదు.
పెయిడ్ ఆర్టిస్టులతో ఎక్కడికి వెళ్లినా మోకాళ్ల దండాలు పెట్టించుకునేవారు. రోడ్డు అంతా ఖాళీగా ఉండేది.. సెక్యూరిటీ ఎవరినీ రానిచ్చేవారు కాదు. కానీ వారు మాత్రం దర్జాగా లోపలికి వచ్చి … ఆ తర్వాత జగన్ వాహనంలో వస్తూంటే అటు వైపు తిరిగి మోకాళ్ళ దండాలువేసేవారు. అత్యంత ఘోరంగా ఓడిపోయేవరకూ ఈ డ్రామాలు జరిగాయి.
2024 ఎన్నికల అయిపోయిన తరువాత, జగన్ IPAC టీం ఆఫీస్ ను సందర్శించినప్పుడు, అక్కడ IPAC టీం జగన్ తో తీసుకున్న సెల్ఫీ తో,
ఈ ఆర్టిస్టులు గుట్టు మరింత బయటపడింది. ఓహో, ఇన్నాళ్లు ఈ టీం మెంబర్లేనా , మాములు జనాలుగా నాటకాలాడారు అని.
తెలుగుదేశం టీం ఈ ఐప్యా క్ నాటకాలు అన్నీ వెదకి వెదకి మరీ బయటకు తీసి, జనం ముందు పెట్టేవారు . దాంతో జనం నవ్వుకునేవారు.
ఈ డ్రామాలు , గులకరాయి డ్రామాలు ఎన్ని ఆడినా, పట్టించుకోకుండా జనాలు వైసీపీ ని 11 సీట్లు ఇచ్చి దారుణంగా ఓడించారు.
ఇక IPAC టీం ను జగన్ తీసేశాడని వార్తలు వచ్చాయి. అందరు నిజమే కాబోలు అనుకున్నారు. కానీ, నిన్న , జగన్, విజయవాడ సబ్ జైల్లో లో వున్న
వల్లభేనేని వంశీ ని పరామర్శించి, బయటకు వచ్చి, మీడియాతో ప్రసంగించిన తరువాత, IPAC టీం ను జగన్ తీసెయ్యలేదని తెలిసింది.
నిన్న విజయవాడ జైలు దగ్గర జగన్ ప్రసంగం తరువాత ఏమి జరిగింది ?
నిన్న , జగన్, విజయవాడ సబ్ జైల్లో వున్న వల్లభేనేని వంశీని పరామర్శించి, బయటకు వచ్చి, మీడియా తో ప్రసంగించిన తరువాత, IPAC టీం ను జగన్ తీసెయ్యలేదని తెలిసింది. ఎలాగంటే, జగన్ ప్రసంగం ముగిసిన తరువాత ఓ పాప జగన్ దగ్గరకు చేరడం కోసం వెక్కి వెక్కి గుక్క పెట్టి ఏడ్చిం ది. తం డ్రి భుజాల మీద కూర్చో పెట్టుకుని దగ్గరకు తీసుకెళ్లాడు. అది జగన్ చూసి దగ్గరకు తీసుకున్నా రు.
జగన్ తన పాత పాదయాత్ర స్టైల్ లో, ఆ పాప నుదిటిమీద ముద్దు పెట్టారు. పాప వెంటనే సెల్ఫీ తీసుకుని ఆనంది చేసింది. అది చూసి అక్కడ గుమి గుమి గూడిన వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు, సీఎం , సీఎం అని పదే పదే అరిచారు. ఇది చూసి, వెంటనే, సాక్షి ఛానల్లో, వైసీపీ సోషల్ మీడియా లో జగన్ కు తగ్గని ప్రజాదరణ అంటూ, బ్రేకింగ్ లు, స్క్రోలింగ్ లు వేసేసారు.
అసలు జగన్ కోసం సొంత తల్లి, చెల్లే ఏడవడం లేదు…. అంత చిన్న పిల్ల జగన్ కోసం ఏడుస్తుందని, జనం ఎలా నమ్ముతారని సాక్షి టీం అనుకున్నారో
అర్ధం కాదు.
అయితే ఆ పాపతో వేయించిన నాటకం అక్కడితో ఆపేస్తే బాగుం డేది. జగన్ దగ్గరకు తీసుకోగానే, ఏడుపు ఆపేసి సెల్ఫీ తీసుకోవడమే నవ్వుతెప్పించేది అయితే, ఆ తరువాత సాక్షి ఛానల్ చేసిన ఓవర్ ఏక్షన్ తో గుట్టు బయటపడింది.
సాక్షి ఛానల్ ఆ పాప ముందు మైక్ పెట్టి మాట్లాడించారు, ఆ పాప మాట్లాడుతూ, ఇప్పుడు అమ్మ ఒడి డబ్బు లు రాక ఇబ్బం ది పడుతున్నాం, ఫీజులు కూడా కట్టలేదు అని మాట్లాడింది. ఆ తరువాత ఇంకేమి మాట్లాడలేక తడబడింది( ఆ పాపకు అంతవరకే మాట్లాడమని ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. )
సాక్షి ఛానల్, మరియు వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్ లలో, ఆ పాప మాటలు పదే పదే ప్రసారం చేసారు.
వెంటనే, టీడీపీ సోషల్ మీడియా టీం రంగం లో దిగింది. ఆ పాప బ్యాక్ గ్రవుండ్ ఏమిటా అని ఆరాతీస్తే అసలు గుట్టు బయటపడింది.
ఆ పాప రెడ్డి సామాజిక వర్గం అని, ఆమె తండ్రి బం గారు నగల దుకాణం లో పార్టనర్ అని, తల్లి కూడా ప్రయివేటు ఉద్యో గిని అని, పాప చదివేది
రవీం ద్ర భారతి స్కూ లులో అని తేలిం ది. రవీంద్ర భారతి లో ఫీజు సంవత్సరానికి లక్ష పైనే ఉంటుంది. ఆ తల్లికి వున్న ఇద్దరు పిల్లలు ఇద్దరూ కూడా రవీంద్ర భారతి స్కూల్ లో చదువుతున్నారు. ఇద్దరూ కూడా రవీంద్ర భారతి స్కూల్ లో చదువుతున్నారు.
మరి సంవత్సరానికి లక్షల్లో ఫీజు చెల్లించే ఆ కుటుంబం , అమ్మఒడి, 15,000 రాకపోవడంతో ఫీజు కట్టకపోవడం ఉంటుందా ? పైగా ఆ పాప తల్లి కూడా వైసీపీ అభిమాని అని తేల్చారు.
మీ డ్రామా కోసం, రాజకీయాల కోసం ,చిన్న పిల్లను బలి చేస్తారా ? రేపు, ఆ స్కూల్ లో పిల్లలు , ఆ పాపను వెక్కిరిస్తే, ఆ పాపం మానసిక స్థితి ఏమిటి
అని జనాలు మండిపడుతున్నారు.