19th May 2025
అతడిని అల్లుడిలా కాకుండా కొడుకులా చూశాను. నిర్మాతగా అప్పుల పాలయ్యాను
“నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నాడు. రవి ఎన్నో అబద్థాలు చెబుతున్నారు.”
ఇదీ తమిళ హీరో, జయం రవి అత్తగారు, జయం రవి భార్య అయిన ఆర్తి తల్లి మరియు నిర్మాత సుజాత విజయ్‌కుమార్ తాజా వ్యాఖ్యలు.
జయం రవి, ఆర్తి మధ్య విడాకుల ఇష్యూ ఎప్పటినుండో నడుస్తోంది.
జయం రవి, ఎప్పుడో, భార్య ను వదిలేసి, బయటకు వచ్చేసాడు, వారి మధ్య విడాకులు ఇష్యూ కోర్ట్ లో నడుస్తోంది.
జయం రవి, బయటకు వచ్చేసినప్పటినుండి, సింగర్ కెనీషా (Kenisha) , ఈ విడాకులకు కారణం అని బయట రూమర్లు వినిపిస్తున్నాయి. సింగర్ కెనీషా ఆ వార్తలని ఖండించింది కూడా.
ఈ మధ్య సింగర్ కెనీషా తో జయం రవి సన్నిహితంగా వున్న ఫోటో నెట్ లో వచ్చిన తరువాత, జయం రవి భార్య ఆర్తి, మరోసారి జయం రవి ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారు.
దానికి జయం రవి కూడా కౌంటర్ ఇస్తూ కామెంట్స్ పెట్టాడు.
తాజా గా ఈ వివాదం లోకి జయం రవి అత్తగారు, నిర్మాత సుజాత విజయ్‌కుమార్ వచ్చారు. జయం రవి తీరును తప్పుపడుతూ ఒక ప్రకటన రిలీజ్ చేసారు.
‘‘రవిని అల్లుడిలా కాకుండా కొడుకులా చూశాను, రవి ఎన్నో అబద్థాలు చెబుతున్నారు, ఆయన చేసే వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు,
రవి ప్రోత్సాహంతోనే , నేను సినిమాల్లోకి వచ్చాను. నేను నిర్మాతగా, రవి నే హీరోగా పెట్టి ‘అడంగ మరు’, ‘సైరన్’ చిత్రాలను నిర్మించా. ఈ సినిమాల కోసం ఫైనాన్షియర్ల నుంచి రూ.100 కోట్లు అప్పు తీసుకున్నా. అందులో 25 శాతం రవికి పారితోషికంగా చెల్లించా, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇప్పుడు నాదగ్గరే ఉన్నాయి
ఈ అప్పుల వల్ల నా జీవితంలో ప్రశాంతత లోపించింది, నేను ఒక్కదాన్నే వడ్డీలు కట్టుకునేదాన్ని.
నష్టాల నుంచి బయట పడేయడానికి నా బ్యానర్లో మరో సినిమా చేస్తానని ‘సైరన్’ సమయంలో మాటిచ్చాడు. కానీ, ఏ చిత్రానికి సంతకం చేయలేదు. అంతేకాకుండా, అప్పులు తీర్చడానికి సాయం చేస్తానని కూడా చెప్పలేదు.
తనని నేను ఎప్పుడూ ఒక అల్లుడిలా చూడలేదు. కొడుకుగా భావించా. అతను ఎప్పుడూ బాధ పడకూడదనుకున్నా. ఇప్పుడు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నాడు.
నన్ను ఎప్పుడూ, అత్తగారు అని కాకుండా, అమ్మ అనే రవి , ప్రేమగా పిలిచేవాడు. ఆ అమ్మగా నేను కోరుకునేది ఒక్కటే.. నేను ఇంతకాలం ఒక హీరోగానే చూసిన చూసిన రవి, ఇప్పుడు సానుభూతి పొందడం కోసం అతడు చేసే ఆరోపణలు చూస్తుంటే . హీరో అనే భావన పోతోంది, బాధగా ఉంది. రవి ఎప్పుడూ ఒక హీరోగానే ఉండాలని కోరుకుంటున్నా’’ .
ఈ ప్రకటన పై, మరి జయం రవి ఏం కౌంటర్ ఇస్తాడో చూడాలి.