14th April 2025
2019 ఎన్నికలకు ముందే ఇంటెలిజెన్సు చీఫ్ గా వున్న A.B .వెంకటేశ్వరరావు ను తప్పించాలని, జగన్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు కి లెటర్ రాసాడు. చంద్రబాబు అప్పటికే NDA నుండి బయటకు వచ్చేసి, కేంద్ర బీజేపీ మీద పోరాడుతున్నాడు. అందుకే, కేంద్ర బిజేపి నుండి జగన్ కు సహకారం లభించేందేమో, జగన్ లెటర్ రాయగానే, AB ని అప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల్లోనుండి తొలగించింది.
ఆ తరువాత జగన్ సీఎం అయ్యాక,
2019 లో వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత ఆయనకు యే పోస్టింగ్ ఇవ్వకుండా వెంకటేశ్వర రావు ను పక్కన పెట్టారు. ఆరు నెలల తర్వాత, టీడీపీ హయాంలో ఫోన్ ట్యాపింగ్ డివైసెస్ కొనుగోలు చేసారని, దాన్లో అవకతవలు జరిగాయని, దేశద్రోహంచేశారనే ఆరోపణలతో ఆయన్ని సస్పెండ్ చేసారు.
తన సస్పెన్షన్ అక్రమం అని, అన్ని కోర్టుల్లోనూ , వెంకటేశ్వరరావు పోరాడినా, కోర్టులన్నీ , చివరికి CAT (central administrative tribunal), ఏబీవీ కే అనుకూలంగా తీర్పు ఇచ్చినా, జగన్ పట్టించుకోలేదు. సీఎం గా వున్న 5 ఏళ్ళు, అయన మీద సస్పెన్షన్ ను కొనసాగించాడు. చివరికి ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత, జగన్ ఆపద్ధర్మ సీఎం గా మారిన తరువాత, జగన్అ కు అనుకూలంగా మొదటినుండీ వ్యవహరిస్తూ వస్తున్న అప్పటి చీఫ్ సెక్రటరీ , జవహర్ రెడ్డి, రిటైర్మెంట్ ఆఖరి రోజు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం అధిపతిగా పోస్టింగ్ ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వం విధించిన అక్రమ సస్పె న్షన్ పై సుదీర్ఘం గా న్యాయపోరాటం చేసి విజయం సాధిం చిన ఏబీ వెంకటేశ్వ రరావు, డీజీపీ కేడర్ లో రిటైర్ అవ్వాల్సిన ఏబీ, మే 31 న అంటే ఆయన సర్వీ సులో చివరితేదీ ఉదయం విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటి గ్ అండ్ స్టేషనరీ ప్రాంతీయ కార్యా లయంలో బాధ్యతలు చేపట్టి.. సాయం త్రానికే పదవీ విరమణచేశారు.
డీజీపీ క్యాడర్ తో రిటైర్ కావలసిన చివరికి ఆ పదవి రాకుండానే, ఒకే ఒక రోజు, డ్యూటీ చేసి, మే 31 న , రిటైర్ అవ్వాల్సి వచ్చింది.
ఒక ప్రభుత్వం తలుచుకుంటే, ఒక సీనియర్ IPS అధికారిని ఎన్ని ఇబ్బందులు పెట్టగలదో, ఏబీ వెంకటేశ్వ రరావు ఉదంతం చూస్తే తెలుస్తుంది.
టీడీపీ కూటమి కూటమి ప్రభుత్వం వచ్చాక, సస్పెన్షన్ కాలంలో పెండింగ్ లో ఉన్న పూర్తి జీత భత్యాలన్నీ ఇవ్వాలని నిర్ణయించి, ఆయనకు న్యాయం చేసారు.
జగన్ ప్రభుత్వ వేధింపులకు ఎదురొడ్డి పోరాడిన ఎబివి కి, ఏదైనా మంచి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని, ఎంతో మంది టిడిపి కార్యకర్తలు,అభిమానులు ఆశించారు. అయితే ఆలస్యంగా అయినా, సరే, టీడీపీ ప్రభుత్వ ఆయనకు , పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆయన స్థాయికి ఇది ఒక మాములు, అప్రాధాన్య పోస్ట్ అని చాల మంది టీడీపీ అభిమానులు భావించారు. దానికి తగ్గట్టే, ఏబీ వెంకటేశ్వ రరావు కూడా ఆ పదవి తీసుకోలేదు. ఈ చర్య పట్ల టీడీపీ అధిష్టానం కూడా గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తోంది.