14th April 2025
2014 నుండి2019 వరకు, సాక్షి ఫేక్ వార్తలు తిప్పి కొట్టలేక, టీడీపీ దెబ్బతిందని , 2019 లో టీడీపీ ఓటమికి అది కూడా ఒక కారణమని
టీడీపీ నాయకులు వాపోతూ వుంటారు. వారి ఆవేదనలో నిజం లేకపోలేదు, ఎందుకంటే అప్పట్లో ఆ ఛానల్ ,పేపర్ లో వచ్చిన కొన్ని వార్తలు
అలా వున్నాయి.
టీటీడీ పింక్ డైమండ్ పోయిందని, ఆ పింక్ డైమండ్, అప్పటి సీఎం చంద్రబాబు ఇంట్లో వెతికితే దొరుకుతుందని విజయసాయి రెడ్డి ఆరోపించడం, సాక్షి లో ఆ వార్త వస్తే, దాన్ని టీడీపీ తిప్పి కొట్టలేకపోయింది. అలాగే 33 మందిని DSP లుగా ప్రమోట్ చేస్తే, అందులో 30 మంది DSP లు, కమ్మవారే అని జగన్ ఆరోపించడం, ఆ వార్త సాక్షి లో రావడం జరిగింది. తీరా చూస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక , అందులో కేవలం 5 గురు మాత్రమే కమ్మవారని, వైసీపీ నాయకులే అసెంబ్లీ లో చెప్పారు.
చంద్రబాబు సీఎం గా ఉండగా, వివేకాను హత్య చేసిన మరునాడే, సాక్షి పేపర్ లో,చంద్రబాబు ఫోటో మొదటి పేజీ లో వేసి, ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి “నారాసుర రక్త చరిత్ర” అని రాస్తే, అప్పుడు చంద్రబాబు , సాక్షి పై పరువునష్టం దావా వెయ్యకుండా, అలక్ష్యం చెయ్యడం వల్ల కొంతమంది అయినా , ఆ వార్త నిజమే అని నమ్మారు .
చంద్రబాబు 2013 భూసేకరణ చట్ట ప్రకారం పోలవరానికి ముంపు పరిహారం తో కలిపి ప్రాజెక్టుకు 55,000 కోట్లు అవుతుందని , కేంద్రానికి అంచనాలు పంపితే, అవినీతి కోసం పోలవరం ఎస్టిమేషన్, చంద్రబాబు 55,000 కోట్లకు పెంచేసాడు, అని సాక్షి లో రాసి, మళ్ళీ జగన్ అధికారంలోకి రాగానే, అంతే సొమ్ము పోలవరానికి అవుతుందని, కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం చూస్తే సాక్షి ఎలా టీడీపీ ని బద్నాం చేసిందో అర్ధం అవుతుంది.
2019 చివరలో, చంద్రబాబు PA పైన IT వాళ్ళు రైడ్ చేస్తే, సాక్షి వాళ్ళు అతని దగ్గర 2000 కోట్లు దొరికాయని ప్రచారం చెయ్యడం, కానీ IT వాళ్ళు అప్పుడే ప్రకటించారు, కేవలం 3 లక్షల కాష్ మాత్రమే దొరికింది అని, టీడీపీ దాన్ని తిప్పి కొట్టలేకపోయింది. అలాగే టీడీపీ సేవామిత్ర ఆప్ ద్వారా, ఆంధ్ర ప్రజలు డేటా మొత్తం చోరీ చేసేసింది, అని సాక్షి లో వచ్చింది. ఇలా ఎన్నో ఫేక్ వార్తలు రాస్తే, దానిని సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపాయింది టీడీపీ.
అందుకే 2019 లో టీడీపీ ఓటమిలో , ఈ ఫేక్ రాతలు కూడా కొంత టీడీపీ ని దెబ్బతీశాయి.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, సాక్షి మళ్ళా ఫేక్ వార్తలు మొదలుపెట్టింది, తప్పుడు ప్రచారాలతో మత విద్వేషాలు సైతం రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని . అని టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు
ఇటీవల నల్గొండ లో, పల్నాడుకు చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతడిని భూ తగాదాలతో అతని అల్లుడే హత్య చేశాడు. సాక్షి తెలంగాణ ఎడిషన్‌లో మామను హత్య చేసిన అల్లుడు అని రాశారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ కు ఎడిషన్ లో, టీడీపీ గూండాలు నల్లగొండలో దాక్కున్నా వెంటాడి హత్యచేశారు అని రాశారు.
తాజాగా , తిరుపతి గోశాలలో ఆవులు చనిపోకపోయినా.. ఎక్కడివో ఆవులు చనిపోయిన ఫేక్ ఫోటోలు సాక్షి లో చూపించి తిరుపతి గోశాల లో ఆవులు చనిపోయాయని, టీటీడీ పాలకమండలి దాన్ని పట్టించుకోవటం లేదని చెప్పింది .
ఎంత మంది నమ్మతారు..ఎంత మంది నమ్మరు అనేది అనవసరం.. ఓ పుకారు ప్రజల్లోకి పంపించి పదే పదే అదే నిజమని చెప్పడం ద్వారా నమ్మించాలని వైసీపీ వ్యూహం. దానికి సాక్షి ఆయుధం. ఈ విషయం టీడీపీకి తెలుసు.. కానీ అడ్డుకట్ట వేయలేకపోతోంది.
ఇంత ఫేక్ న్యూస్ ప్రచారం, సాక్షి చేస్తూ ఉంటే , దాన్ని తిప్పికొట్టాల్సింది, దానికి విరుగుడు కనిపెట్టాల్సింది, అధికారం లో వున్న కూడా టీడీపీనే కదా, కానీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేయకుండా, ఎంతసేపూ సాక్షి , ఫేక్ వార్తలు ప్రసారం చేస్తూ ఉందని ,గగ్గోలు పెట్టడం వల్ల ప్రయోజనం ఉందా ? ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఒక వ్యూహంతో , ప్రణాళికాబద్ధంగా , వాటిని సమర్ధవంతంగా, టీడీపీ సోషల్ మీడియా ద్వారా ఎదుర్కోవాలి.
లేకపోతే, 2019 లో టీడీపీ కి, ఈ ఫేక్ వార్తలవల్ల జరిగిన ఓటమే , మళ్ళా పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది