16th April 2025
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి , అల్లు అర్జున్ వెళ్లారు. ఇదంత పెద్ద న్యూసా , అంటే ఒకరకంగా పెద్ద న్యూస్.
2024 ఎన్నికల ముందు, పవన్ పోటీ చేస్తున్న పిఠాపురానికి వెళ్లి మద్దత్తు తెలపకుండా, పవన్ కు మద్దత్తు ఇస్తున్నట్టు కేవలం ఒక ట్వీట్ తో సరిపెట్టి, కేవలం భార్య స్నేహితుడనే కారణంగా, అల్లు అర్జున్, ఏకంగా కర్నూల్ వెళ్లి వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రెడ్డి కి మద్దత్తు తెలపడంతో, జనసేన సైనికులు తో పాటు, మెగాభిమానులు మండిపడ్డారు. అప్పటినుండి , మెగా ఫామిలీ కి అల్లు అర్జున్ కు మధ్య బాగా గ్యాప్ పెరిగిందన్న వార్తలు వచ్చాయి.
అందుకే పుష్ప సినిమా ఎలాగైనా ఫ్లాప్ చేస్తామని మెగాభిమానులు, జనసైనికులు, బాహాటంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో , మరింత గ్యాప్ వచ్చింది.
అయితే, పుష్ప సినిమా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ప్రమాదం కేసు లో ఒక రోజు జైలు కు వెళ్లొచ్చిన అల్లు అర్జున్, తిరిగి వచ్చిన తరువాత , తన మావయ్య చిరంజీవి ఇంటికి సతీ సమేతంగా వెళ్లి కలవడంతో , అర్జున్, మెగా ఫామిలీ మధ్య గ్యాప్ తొలగిపోయింది అని అందరు అనుకున్నారు.
అయితే, కొద్ది రోజుల క్రితం, అనిల్ రావిపూడి దర్శకత్వంలో, చిరజీవి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో , అక్కడికి వచ్చిన, అల్లు అరవింద్ ను, చిరంజీవి పట్టించుకోలేదన్నట్టుగా, విజువల్స్ , సోషల్ మీడియా లో వచ్చాయి. దానితో, అల్లు ఫామిలీ తో, ఆ గ్యాప్ ఇంకా అలాగే ఉందా అని సందేహాలు వచ్చాయి.
ఇప్పుడు వర్తమానానికి వస్తే,
ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు.. అదే రోజు సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. పవన్ వెంటనే, సింగపూర్ వెళ్లారు. ఆ సందర్భంగా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, కోరుకుంటున్నామని , సంఘీభావం తెలుపుతూ, రాజకీయ నాయకుల దగ్గరనుండి, జూనియర్ ఎన్టీఆర్ వంటి సినీ సెలెబ్రిటీలు వరకు, చాలా మంది ట్వీట్ చేసారు. అయితే, అందరు విష్ చేసినా, మెగా ఫామిలీ కే అల్లు అర్జున్ కనీసం స్పందించలేదంటూ మళ్ళా మెగాభిమానులు, జనసేన అభిమానులు, ట్వీట్లు గుప్పించారు.
ఆ తరువాత, సింగపూర్ లో చికిత్స తరువాత తన కుమారుడు మార్క్ శంకర్ ను పవన్ కల్యాణ్ దంపతులు హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ , ఏప్రిల్ 14 న , పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటకు పైగా పవన్ నివాసంలోనే ఉన్నారు. దీంతో అల్లు, మెగా కుటుంబాల మధ్య గ్యాప్ అన్న వార్తలకు, తాత్కాలికంగా చెక్ పడినట్లయింది.