3rd April 2025.
విశాఖపట్నం రామానాయుడు స్టూడియో కి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నోటీసు లు పంపింది.
ఏ విషయం లో?
వైస్సార్ సీఎంగా వున్నపుడు, విశాఖపట్నంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం, రామానాయుడు స్టూడియో కు, 34.44 ఎకరాలు కేటాయించింది. దానికి నిబంధనలు ఏమిటంటే, ఆ భూమిని కేవలం సినీ స్టూడియో నిర్మాణకి మాత్రమే ఉపయోగించాలి, వేరే అవసరాలకు ఆ భూమి ఉపయోగించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమి వినియోగిస్తే, ప్రభుత్వానికి ఆ భూమి వెనక్కి తీసుకునే హక్కు వుంది.
ఆ తరువాత రామానాయుడు స్టూడియో అక్కడ నిర్మించారు, అయితే, మొత్తం భూమి ని స్టూడియో గురించి వాడకుండా, కొంత భూమి మాత్రమే వాడి, మిగతా భూమి ఖాళీగా ఉంచారు.
అయితే, 2023 లో జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్) నుంచి , స్టూడియో యజమానులు , ఆ ఖాళీగా వున్నభూమిలో, 15కు పైగా ఎకరాలను రియల్ ఎస్టేట్ గా మార్చి నివాస ప్రాంతాలుగా వినియోగించుకునేందుకు, అనుమతి తీసుకుని విల్లాల నిర్మాణం మొదలు పెట్టింది. దీనికి వ్యతిరేకంగా కొంతమంది కోర్ట్ లో కేసులు వేయడంతో ఆ నిర్మాణాలు ఆగిపోయాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత , తాజాగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా , ఆ భూమి ని రియల్ ఎస్టేట్ బిజినెస్ చెయ్యడానికి వాడారు కాబట్టి, ఆ భూమి మొత్తాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు మిగతా స్టూడియో నిర్మించిన భూమిపైనా గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలని, నిర్ణయించింది.
గతంలో వైసీపీ అధికారం లో వున్నపుడు, విశాఖపట్నం లో అనేక మందిని బెదిరించి, ఎన్నో స్థలాలు కబ్జాలు చేసారని, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకున్నారు, అని టీడీపీ ఎన్నో ఆరోపణలు చేసింది. ఆ సమయం లోనే, కొంతమంది వైసీపీ పెద్దలు ఈ స్టూడియోను స్వాదీనం చేసుకుంటామని బెదిరించి మరీ.. అందులో సగం లెక్క కట్టి.. పదిహేను ఎకరాలను వారు లాక్కున్నారని అంటున్నారు. అందుకే ఆ భూమిలో, విల్లాలు నిర్మిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. చివరికి ఇప్పుడు ఆ స్థలం ప్రభుత్వ పరం అయింది.
రామానాయుడు కుటుంబం ఎప్పుడు టీడీపీ తో, చంద్రబాబు తో సన్నిహితంగానే వుంటారు, గతం లో రామానాయుడు టీడీపీ తరుపున బాపట్ల నుండి ఎంపీ గా పోటీ చేసి గెలుపొందారు, ఆ రకంగా కూడా చంద్రబాబు కు వారితో మంచి సఖ్యత వుంది.
అయితే, వైసీపీ అధికారంలో వున్నపుడు, చంద్రబాబు, జైల్లో వున్నపుడు, కొంతమంది సినీ ప్రముఖులు చంద్రబాబు కు మద్దతుగా వ్యాఖ్యలు చేయగా, చంద్రబాబు కు సన్నిహితంగా వుండే, సురేష్ బాబు, చంద్రబాబు అరెస్ట్ పై ఎందుకు స్పందించలేదు అని ఒక ఇంటర్వ్యూ లో అడిగినపుడు, అయన , మాకు ఏ సీఎం అయినా ఒకటే, ఎవ్వరితోను సన్నిహితంగా ఉండము, మేము పాలిటిక్స్ జోలికి వెళ్లము అని అయన జవాబు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి, ఈ వ్యాఖ్యలకు కొంతమంది టీడీపీ పెద్దలు నొచ్చుకున్నారని, అందుకే ఇప్పుడు చంద్రబాబు సీఎం గా అధికారంలోకి వచ్చినా, గతంలో సురేష్ బాబు చేసిన వ్యాఖ్యల ఫలితం కాబోలు , మునుపటి లా, ఆ కుటుంబంతో చంద్రబాబు అంత టచ్ లో లేరు.
అందుకే ఇప్పుడు, విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు విషయం లో , వారికి మేలు చేసే విధంగా గా కాకుండా, చట్ట ప్రకారమే నడుచుకోవాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.