జగన్ నిన్న ప్రెస్ మీట్ లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక, కొత్త పరిశ్రమలు రాకపోగా, వున్నవి వెనక్కి పోతున్నాయని ఎగతాళి చేసాడు. కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామన్న సజ్జన్ జిందాల్ దీనికి ఉదాహరణ అని అన్నాడు.
దీనికి తెలుగు తమ్ముళ్లు కౌంటర్ లు ఇస్తున్నారు, జగన్ హయాం లో ఏ పరిశ్రమలు ఆంధ్ర ను వదిలేసి, పక్క రాష్ట్రాలకు పోయాయో వివరాలు అందిస్తున్నారు.
అప్పటి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ది, చిత్తూరు దగ్గర వున్న, రాయలసీమ లో కొన్ని వందల ఉద్యోగాలు కల్పిస్తున్న అమర్ రాజా బ్యాటరీస్ ని కాలుష్యం పేరుతో
మూసేయించాలని జగన్ ప్రయత్నించలేదా ? ఇదే విషయం సజ్జలను విలేఖరులు అడిగితే, స్వయానా సజ్జల రామకృష్ణ రెడ్డి, మేమే పొమ్మంటున్నాము అని బాహాటంగా చెప్పలేదా ? ఆ 10,000 కోట్ల అమర్ రాజ్ మరో యూనిట్ ను అప్పటి తెలంగాణ IT మంత్రి KTR ఆఫ్వానించడంతో, ఆ కంపెనీ తెలంగాణ కు తరలివెళ్ళిపోయింది.
2014 – 2019 మధ్య కాలం లో చంద్రబాబు సీఎం గా వున్నపుడు, franklin templeton కంపెనీ తెచ్చి వాటికి భూములు కేటాయిస్తే, జగన్ సీఎం అయ్యాక, ఆ కంపెనీ కి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవడంతో ఆ కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ నుండి వెళ్ళిపోయింది. అలాగే లులు ఇంటర్నేషనల్ మాల్ కు చంద్రబాబు వైజాగ్ లో భూమి కేటాయిస్తే, వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని కూడా వెళ్లగొడితే, కుట్ర, తెలంగాణ కు ఆహ్వానిస్తే, హైదరాబాద్ లో వాళ్ళు ఆ మాల్ పెట్టారు(ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక, ఆయన చొరవతో, ఈ లులు మళ్ళా విశాఖపట్నం రావడానికి సిద్ధం అవుతోంది.
ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక, లోకేష్ చాలా సార్లు చెప్పాడు, మేము పెట్టబడులు పెట్టమని పారిశ్రామికవేత్తలను కోరినపుడు, ౫ ఏళ్ళ తరువాత, మళ్ళా టీడీపీ ప్రభుత్వం మారితే, మా పరిస్థితి ఏమిటి, అని వాళ్ళు భయపడుతున్నారని, వాళ్ళని ఒప్పించడానికి మేము చాలా కష్టపడాల్సి వస్తోందని, అంతగా వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలని భయపెట్టింది లోకేష్, అన్నాడు.
ఇక కడప స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, జగన్ సీఎం ఉండగా, కడప లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, రెండు సార్లు శంకుస్థాపన పేరుతో హడావిడి చేసాడు, ఒకసారి సజ్జన్ జిందాల్ ను కూడా కడపకు తీసుకొచ్చాడు(ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వాని కేసు లో సజ్జన్ ను తప్పించడానికి , ఆయన కు మేలు చేస్తున్నాడనే కారణంతోనే, సజ్జన్ , జగన్ అడగ్గానే, సజ్జన్ కడప వచ్చి, అక్కడ స్టీల్ ప్లాంట్ పెడుతున్నట్టు హడావిడి చేసాడని కూడా టీడీపీ అంటూ ఉంటుంది. ) కానీ జగన్ సీఎం గా దిగిపోయేనాటికి ఆ స్టీల్ ప్లాంట్ పెడతామన్న స్థలంలో ఒక్క ఇటుక రాయి కూడా వేయలేదని , టీడీపీ ఇప్పుడు ఎద్దేవా చేస్తోంది. అసలు కడప స్టీల్ ప్లాంట్ వయబుల్ కాదని, అందుకే సజ్జన్ జిందాల్ దీన్ని పట్టించుకోలేదని, ఒక వార్త.
ఇప్పుడు , ఒక్క ఇటుక కూడా వెయ్యని, సజ్జన్ జిందాల్ వదిలేసిన , ఆ స్టీల్ ప్లాంట్ , అప్ వదిలేసి వెళ్లిపోయిందని , ఇప్పుడు ప్రతిపక్షంలో వున్న జగన్ ప్రచారం చెయ్యడం, చాలా హాస్యాస్పదంగా ఉందని టీడీపీ అంటోంది.
అసలు , సజ్జన్ ను, మీరు కడప లో స్టీల్ ప్లాంట్ పెట్టద్దని చంద్రబాబు ఏమైనా చెప్పాడా ? లేదు కదా, మరి ఎందుకు సజ్జన్ జిందాల్ , ఈ స్టీల్ ప్లాంట్ విషయం లో మరలా ఒక్క అడుగు కూడా ముందుకువెయ్యలేదు ? ఎందుకంటే, టీడీపీ బాహాటంగా బయటకు అనకపోయినా, అసలు కడప స్టీల్ ప్లాంట్ వయబుల్ కాదని, అందుకే సజ్జన్ జిందాల్ దీన్ని పట్టించుకోలేదనే భావన అప్ లోనే అన్ని పార్టీ ల్లోనూ వుంది.
అసలు విషయం ఏమిటంటే, ఈ సజ్జన్ జిందాల్ తో చంద్రబాబు కు కొంత సాన్నిహిత్యం వుంది, దానికి తోడు కేంద్రం లో బీజేపీ కి సహకరించాలి, ఆ బీజేపీ కి కూడా ఈ జిందాల్ సన్నిహితుడు . అందుకనే, కాదంబరి జెత్వాని కేసు లో, జేత్వాన్ని ని అక్రమ కేసు లో ఇరికించి జైల్లో పెట్టేలా చేసిన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ను మూడు నెలలు జైల్లో పెట్టింది, ఈ అక్రమ అరెస్ట్ కు సహకరించిన, ముగ్గరు లిప్స్ లను సస్పెండ్ చేసింది, అంతే తప్ప, దీనికి పరోక్షంగా కారకుడైన జిందాల్ ను టచ్ చెయ్యలేదు చంద్రబాబు ప్రభుత్వం , భవిష్యత్తులో లో చెయ్యదు కూడా . ఎందుకంటే, జిందాల్ ను ఇబ్బంది పెడితే, అటు బీజేపీ తో పేచీ, ఇటు రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలనుకునే, పారిశ్రామికవేత్తలంతోను ఇబ్బంది. ఇదీ విషయం.