24th March, 2025.
జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , ఒక తమిళ్ యూట్యూబ్ ఛానల్ తంతి టీవీ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో, “తమిళనాడులోనూ మా పార్టీ ని విస్తరిస్తా” అని చెప్పడం హైలైట్ గా నిలిచింది.
ఇంత అర్జెంటు గా ఆ తమిళ్ ఛానల్ కు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చారు ?
ఇటీవల పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో పవన్ హిందీ భాష విషయంలో తమిళనాడు లో జరుగుతున్న రగడ, హిందీ భాషా నిర్బంధం పై స్టాలిన్ చేస్తున్న ఉద్యమం పై, పవన్ కొన్ని వ్యాఖ్యలు చేసారు, అవి మిస్ ఫైర్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు తమిళనాడు లో కూడా చర్చనీయాశం అయ్యాయి. కొంతమంది DMK ప్రముఖులైతే, పవన్ ను ఈ విషయంలో దుయ్యబట్టారు, పవన్ గతంలో ఉత్తరాది వారు హిందీ భాష ను దక్షిణాది పై ఎలా రుద్దుతున్నారో, ఆ విషయంలో బీజేపీ చేస్తున్న చర్యల్ని విమర్శించిన విషయం చెపుతూ, ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా బయటపెట్టారు.
తన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయిన క్రమంలో ఈ అంశాల పై వివరణ ఇవ్వాలని పవన్ నిశ్చయించుకుని, ఈ తమిళ్ ఛానల్ తంతి టీవీ కి కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్ కు తమిళ్ బాగానే వచ్చు కాబట్టి, ఇంటర్వ్యూ ఆద్యంతం తమిళ్ లోనే మాట్లాడారు.
ఆ ఇంటర్వ్యూ లో పవన్ చెప్పిన ముఖ్యాంశాలు చూద్దాము.
” నిర్బంధంగా హిందీ నేర్పించాలనే విధానానికి నేను వ్యతిరేకం, నేను కూడా స్వచ్చందంగానే తమిళం, హిందీ నేర్చుకున్నాను”.
“బ్రిటిష్ వారు ఇంగ్లిష్ భాష తీసుకొస్తే, మనం నేర్చుకోలేదా ? దానికి లేని భయం మన జాతీయ భాష అయిన హిందీ నేర్చుకోడానికి ఎందుకు ?”
“చాలా మంది నేతలు పలువురు హిందీ భాషలో ప్రసంగాలు చేస్తుంటారు. కానీ హిందీని వ్యతిరేకిస్తూ వుంటారు , ఇది వారి ద్వంద వైఖరికి నిదర్శనం. “
“తమిళనాడులో బీజేపీ పుంజుకునే చాన్స్ వుంది, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు “
“డీలిమిటేషన్ తో( పునర్ విభజనతో), లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గితే, దాన్ని అంగీకరించకూడదు , అయితే, డీలిమిటేషన్ తో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గదు అని నేను నమ్ముతున్నాను.
“తమిళ ప్రజలు ఆదరణ చూపిస్తే ,తమిళనాడులో కూడా జనసేన పార్టీని విస్తరిస్తాను”.
“సినిమాల్లో నటిస్తాను, ఎప్పటిదాకా అంటే, డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు నటిస్తాను” .