18th May 2025
భారత సైనిక రహస్యాలను లీక్ చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలపై హర్యానాకు చెందిన యువ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. “ట్రావెల్ విత్ జో” అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న ఆమెపై, సున్నితమైన రహస్యాలను విదేశీ ఏజెంట్లకు అందించిన ఆరోపణలు ఉన్నాయి.
జ్యోతి తన యూట్యూబ్ ఛానల్లో పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు షేర్ చేసింది, వాటిలో “Indian Girl in Pakistan” మరియు “Indian Girl Exploring Lahore” వంటి వైరల్ వీడియోలు ఉన్నాయి.
జ్యోతి యూట్యూబ్ ప్రయాణాలు – పాకిస్తాన్ కంటెంట్‌పై దృష్టి
జ్యోతి తన ఛానల్‌లో ఇప్పటివరకు 487 వీడియోలు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఈ వీడియోలు వైరల్ అయ్యాయి:
Indian Girl in Pakistan
Indian Girl Exploring Lahore
Indian Girl at Katas Raj Temple
Indian Girl Rides Luxury Bus in Pakistan
ఈ కంటెంట్ కారణంగా ఆమెపై అనుమానాలు మొదలయ్యాయి.
హర్యానా పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్, IB కలసి విచారణ
జ్యోతిపై హర్యానా పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్, మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో కలిసి విచారణ చేపట్టారు. ఆమె మొబైల్, ల్యాప్‌టాప్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. పోలీసుల ప్రకారం, జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ పౌరుడు డానిష్తో మెలకువగా టచ్‌లో ఉండేదని వెల్లడించారు. ఆమె అనేక పాకిస్తానీ నంబర్లతో కమ్యూనికేషన్ జరిపిందని, వాటిని ప్రత్యేక కోడ్ పేర్లతో సేవ్ చేసుకున్నట్లు తెలిపారు.
డానిష్ – పాకిస్తాన్ హైకమిషన్‌లో పని, ఖర్చులన్నీ భరింపు అధికారుల ప్రకారం, డానిష్ పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్నాడు. జ్యోతి పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన అన్ని ఖర్చులను అతనే భరించాడని వెల్లడైంది. ఇది పాక్ ప్రభుత్వ మద్దతుతో జరిగిన పర్యటనగా భావిస్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, జ్యోతి మల్హోత్రా ఇటీవల పాకిస్థాన్‌కు ట్రావెల్ వీసా మీద వెళ్లి అక్కడ ఐఎస్ఐ (ISI) నిఘా సంస్థతో సంబంధాలు పెంచినట్లు గుర్తించబడింది. అంతేకాదు, భారత దేశానికి సంబంధించిన కీలక సైనిక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసినట్లు అధికారులు తెలిపారు.
అరెస్టు అయిన ఇతర అనుమానితులు – వీరికి ISI తో లింకులున్నాయా అనే అనుమానాలు వున్నాయి.
ఇంతవరకు 9 మంది అనుమానితులను అరెస్టు చేశారు. వారిలో పలు రాష్ట్రాల నుండి వ్యక్తులు ఉన్నారు:
నోమాన్ ఇలాహి – కైరానా (యూపీ)
అర్మాన్ – నుహ్
దేవేంద్ర సింగ్ ధిల్లోన్ – కైతాల్
షాజాద్ – మొరాదాబాద్
ముర్తజా అలీ – జలంధర్
జ్యోతి మల్హోత్రా – హర్యానా
ఈ వ్యక్తులంతా ISI కోసం గూఢచర్యం చేస్తున్నారా? లేక డానిష్ వారిని విడివిడిగా నియమించుకున్నాడా? అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
కైరానా – ISI కోసం కేంద్ర బిందువు?
ఉత్తరప్రదేశ్‌లోని కైరానా ప్రాంతం ISI కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి యువత పాకిస్తాన్‌కు వెళ్లి శిక్షణ పొందినట్టు, అక్కడి నుండి గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ట్రావెల్ వ్లాగింగ్ లేదా టార్గెట్ చేసిన ప్రచారం?
ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్‌లను టార్గెట్ చేస్తూ, పాకిస్తాన్‌ను సానుకూలంగా చూపించాలనే ప్రయత్నమేనా? డానిష్ యూట్యూబర్ జ్యోతిని ఉపయోగించి పాకిస్తాన్ ఛాయా ప్రచారానికి ప్రయత్నించాడా? ఇది ఇంకా నిర్ధారణ కావాల్సిన అంశమే.
అరెస్టు చేయబడిన అనుమానితులందరూ ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నారా లేదా డానిష్ కాలక్రమేణా వారిని గూఢచర్యం కోసం విడిగా నియమించుకున్నారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. UPI మరియు నిందితులతో అనుసంధానించబడిన ఇతర ఆర్థిక మార్గాలతో కూడిన డబ్బు ట్రయల్స్ కూడా దర్యాప్తులో ఉన్నాయి.
ఫోన్ కాల్స్, సందేశాలు మరియు చాట్‌ల ద్వారా డానిష్‌తో జరిగిన అన్ని కమ్యూనికేషన్‌లు కోడ్ పేర్లను ఉపయోగించి నిర్వహించబడ్డాయని విచారణలో తేలింది. నిందితులు వారి ఫోన్‌లలో పాకిస్తానీ పరిచయాలను వేర్వేరు కోడ్ పేర్లతో సేవ్ చేసుకున్నారు.
డానిష్ భారతదేశంలోని అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పరిచయం కలిగి ఉన్నాడు. పహల్గామ్ ఉగ్రవాద దాడి మరియు కొనసాగుతున్న భారతదేశం-పాకిస్తాన్ వివాదం సమయంలో, జ్యోతి డానిష్‌తో నిరంతరం టచ్‌లో ఉంది. జ్యోతి తన సందర్శనల సమయంలో కాశ్మీర్‌లో ఎవరిని కలిశారనే దాని గురించి అధికారులు ప్రస్తుతం సమాచారాన్ని సేకరిస్తున్నారు.
భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌లను చొరబాట్లతో, డానిష్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పాకిస్తాన్ ఇమేజ్‌ను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాడు, ముఖ్యంగా పహల్గామ్ దాడి తర్వాత. డానిష్ జ్యోతిని ఒక ఆస్తిగా ఉపయోగించుకుంటున్నాడు.
జ్యోతి పాకిస్తాన్‌కు వెళ్లడానికి అయ్యే అన్ని ఖర్చులను డానిష్ భరించాడు, అతను పాకిస్తాన్ హైకమిషన్‌లో పోస్ట్ చేయబడ్డాడు మరియు ఆమె పాకిస్తాన్ పర్యటనలన్నీ పాకిస్తాన్ స్పాన్సర్ చేయబడ్డాయి.
గూఢచార్యం ముఠా ఆధారాలు:
జ్యోతి మల్హోత్రా మరో ఐదుగురితో కలిసి ఇన్ఫార్మేషన్ నెట్‌వర్క్‌లో భాగంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీలో ఉన్న పాకిస్థాన్ హైకమిషన్లో ఉద్యోగిగా పనిచేసిన ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్ ద్వారా ఆమె ఈ ముఠాలో చేరిందని సమాచారం.
తాజాగా భారత ప్రభుత్వం డానిష్‌ను దేశం నుంచి బహిష్కరించింది. అతని కాంటాక్ట్స్‌పై విచారణ చేస్తూ జ్యోతి భద్రతా వ్యవస్థల కంటపడింది.
సాంకేతిక మార్గాల్లో గూఢచార్యం:
జ్యోతి మల్హోత్రా, పాక్ నిఘా సంస్థలతో వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్‌డ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారం దేశ భద్రతకు సంబంధించి డిజిటల్ వేదికల వాడకంపై ఆందోళన కలిగిస్తోంది.
విచారణ లో తెలుస్తున్న వాసవాలు చూస్తూ ఉంటే , ఆమె ఈ దేశానికి శత్రువే, ఒప్పుకోవాలి. అందుకే … ఆమెతోపాటు ఆమెకు సహకరించిన వ్యక్తుల్ని కూడా అరెస్టు చేశారు…
ఈ జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియా చరిత్ర చూస్తే, అంతా వివాదాస్పదంగా నే కనిపిస్తుంది.
ఆమె యూట్యూబ్ అకౌంట్ “Travel with JO” ను ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఇలాంటి వివరాలను, మీడియా బయటపెడుతోంది. ఆమె గతం చూస్తే, ఆమెది వివాదాస్పద ప్రవర్తన, చిల్లర మెంటాలిటీ వున్న వ్యక్తి అని అర్థమవుతోంది…
జ్యోతి మల్హోత్రా గతంలో చైనా లో పర్యటించినపుడు, ఆమె వివాదాస్పద ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. బస్సులో టికెట్ లేకుండా ప్రయాణించడం, స్థానికులను ఇబ్బంది పెట్టడం, బులెట్ ట్రైన్‌లో ప్రయాణికులతో అసౌకర్యంగా వ్యవహరించడం వంటి ఘటనలు ఆమె యూట్యూబ్ వీడియోల ద్వారా బయటపడ్డాయి. దీంతో చైనాలోనూ ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చాలా మంది నెటిజన్లు, ఆమె వీడియోలను రిపోర్ట్ చెయ్యడంతో, చివరకు ఆమె దిగివచ్చి, నెటిజన్లకు , క్షమాపణలు చెబుతూ వీడియోలో చేసింది. .
ఇది ఒక్కసారి, ఒక్క రోజు జరగలేదు, ఆమె యూట్యూబ్ వీడియోలను గమనిస్తే, పలుచోట్ల అనుమానాస్పద ప్రవర్తన కనిపిస్తుంది. జ్యోతి గతంలో హైదరాబాద్‌కి వచ్చినప్పుడే, ఎన్నికల నాటికి ఓ ప్లాన్‌లో భాగంగా దేశంలో ప్రయాణించిందా అన్న కోణంలో సెక్యూరిటీ ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి.
ఈ అరెస్ట్ తరువాత అసలు ఆమెకు బెయిల్ కూడా దొరికేటట్టులేదు. చూడాలి, ముందు ముందు ఈ జ్యోతి మల్హోత్రా గురించి, ఇంకా ఎన్ని విషయాలు బయటపడాతాయో,