ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. మోదీకి షర్మిల సూటి ప్రశ్న

What happened to the promises made? Sharmila's direct question to Modi

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ఢిల్లీ ఏపీ భవన్‌లో పీసీసీ చీఫ్ షర్మిల (APCC Chief YS Sharmila) నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై (PM Modi) షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఏపీకి ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని.. మోదీ చెప్పారు. ఏపీని స్వర్ణాంధ్ర చేస్తా అన్నారు… పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మోదీ. మరి ఇవన్నీ ఏమయ్యాయి’’ అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలకు చట్టప్రకారం కల్పించిన హక్కు ప్రత్యేక హోదా అని చెప్పుకొచ్చారు. ఏపీకి కొత్త రాజధాని కడతామని చెప్పి పదేళ్లు పూర్తయిందన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లు పూర్తయిందని… మరి ఇప్పుడు ఏపీకి రాజధాని ఏది అని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *