పిఠాపురం వర్మ కు మరలా అన్యాయం జరిగిందా ?

ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో , టీడీపీ 3 తీసుకుంది, 1 జనసేన కు ఇచ్చింది, అనూహ్యంగా 1 బీజేపీ కి ఇచ్చింది.

 

జనసేన తరుపున, నాగబాబు నామినేషన్ వేసేసారు. ఎమ్మెల్సీ అయిన తరువాత నాగబాబు కి మంత్రి పదవి ఖాయం. ఈ విషయం టీడీపీ ఒక లెటర్ హెడ్ , ఎప్పుడో 2 నెలల క్రితమే రిలీజ్ చేసింది. వారసత్వ సాంప్రదాయ రాజకీయాలకు మేము వ్యతిరేకం అన్న పవన్ కళ్యాణ్ , ఇప్పుడు అన్నయ్య నాగబాబు కి ఎలా ఎమ్మెల్సీ నే కాకుండా మంత్రి పదవి ఇస్తారని, వైసీపీ ఎండగడుతోంది. అంతేకాదు, జనసేన కు వున్ననాలుగు మంత్రి పదవుల్లో ముగ్గురు కాపులే. సామజిక న్యాయం పాటించరా, మొత్తం కాపులతోనే నింపేస్తారా అని వైసీపీ విమర్శిస్తోంది, కానీ మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే మరీ ఎక్కువ విమర్శలు చేసి, 25% వున్న కాపు వోట్ బ్యాంకు తో వైసీపీ పేచీ పెట్టుకోదలుచుకోలేదు.

 

జనసేన దీనికి ధీటుగానే బదులిస్తోంది. నాగబాబు , గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ గా, అనకాపల్లి నుండి పోటీ చెయ్యాలని తలచినా, పొత్తులో భాగంగా ఆ ఎంపీ సీట్ బీజేపీ సి ఎమ్.రమేష్ కు త్యాగం చేసారని, ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, కూటమి హవా లో ఎప్పుడో ఎంపీ గా గెలిచేవారని, అప్పుడు కేంద్రం లో మంత్రి పదవి కూడా దక్కి వుండే ఛాన్స్ ఉండేదని దాన్ని త్యాగం చేసారని , జనసేన కౌంటర్ ఇచ్చింది.

అయితే, టీడీపీ 3 స్థానాలకు , టీడీపీ లో కనీసం 30 మంది ఆశావహులు పోటీ పడ్డారు. పొత్తులో భాగంగా ఎమ్మెల్యే స్థానాలు త్యాగం చేసినవారికి, మొదట ప్రాధాన్యత టీడీపీ ఇస్తోందని వార్తలొచ్చాయి. ఈ లెక్కన, పిఠాపురం స్థానాన్ని జనసేన అధినేత పవన్ కు త్యాగం చేసిన పిఠాపురం వర్మ కు , దేవినేని ఉమా కు ఈ సారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, వారి ఆశలు వమ్ము చేస్తూ, కొన్ని సామాజిక సమీకరణాల్లో భాగంగా, వర్మ కు, దేవినేని ఉమా కు ఇవ్వలేకపోతున్నామని, ఈ విషయం వారికి టీడీపీ అధిష్టానం ఫోన్ చేసి తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *