టెస్టుల్లో 500 వికెట్స్ తీసిన అశ్విన్

Aswin took 500 wickets in Test cricket

టెస్టుల్లో 500 వికెట్స్ తీసిన అశ్విన్ 

భారత్ ఇంగ్లాండ్ మధ్య, రాజ్ కోట్ లో జరుగుతున్న 3 వ టెస్ట్ రెండవ రోజు, ఇంగ్లాండ్ బ్యాట్స్ మాన్ , జాక్ క్రాలే ను అవుట్ చేయడం ద్వారా, అశ్విన్ టెస్టుల్లో 500 వికెట్స్ సాధించి మరో మైలు రాయి అందుకున్నాడు. 98 టెస్ట్ మ్యాచ్ లు ఆడి ఈ ఘనత సాధించిన అశ్విన్, 25714 బాల్స్ బౌల్ చేసి, తక్కువ బంతుల్లో 500 వికెట్లు సాధించిన ప్రపంచ బౌలర్లలో రెండవవాడు అయ్యాడు. 25528 బంతుల్లో 500 వికెట్ లు సాధించి, ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మెక్ గ్రాత్ మొదటి స్థానం లో వున్నాడు.

అయితే టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్లలో అశ్విన్ 2 వ స్థానం లో వున్నాడు. అనిల్ కుంబ్లే , 132 టెస్ట్ మ్యాచెస్ లో, 600 వికెట్లు సాధించి మొదటి స్థానంలో వున్నాడు, 3వ స్థానంలో కపిల్ దేవ్ 131 మ్యాచుల్లో 434 వికెట్లు, 4 వ స్థానంలో 103 మ్యాచుల్లో, 417 వికెట్లు సాధించి హర్భజన్ సింగ్ వున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *