భారత్, ఇంగ్లండ్ 2వ టెస్ట్..యశస్వి జైస్వాల్ రికార్డు

Yashasvi Jaiswal's record in India, England 2nd Test

భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మొదటి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలిరోజు భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal) అదరగొట్టాడు. జైస్వాల్ 256 బంతుల్లో 179 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

యశస్వి బేస్‌బాల్ స్టైల్‌లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్ 49వ ఓవర్‌లో టామ్ హార్ట్లీ వేసిన బంతిని సిక్సర్‌ బాదడంతో 151 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. యశస్వికి టెస్టు కెరీర్‌లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. గత ఏడాది జూలైలో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన యశస్వి టెస్టు కెరీర్‌లో 171 పరుగులతో తొలి సెంచరీ నమోదు చేశాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *