సజ్జల భార్గవ్ రెడ్డి కి దక్కని ఊరట…..

sajjala-bhargava-reddy-suffers-setback-in-supreme-court

December 2, 2024

 

వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల రామకృష్ణ రెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జగన్ 5 ఏళ్ళ పాలనలో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టి, టీడీపీ నాయకులను, టీడీపీ మహిళలను వేధించిన వారిని ఇప్పుడు వెంటాడుతోంది.

వర్రా రవీంద్రారెడ్డి

ముఖ్యంగా అవినాష్ రెడ్డి అనుచరుడు అని చెప్పుకునే, వర్ర రవీందర్ రెడ్డి, టీడీపీ వాళ్లపై, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై, ఆఖరికి జగన్ సొంత చెల్లెలుషర్మిల  పై కూడా అసభ్యకరమైన, జుగుప్సాకరమైన పోస్టులు పెట్టేవాడు, వీటిపై హైదరాబాద్ లో షర్మిల ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

జగన్, తన సొంత చెల్లెలుపై అసభ్య పోస్టులు పెట్టే వర్ర రవీందర్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని, షర్మిల వాపోయేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక, వర్ర రవీందర్ రెడ్డి ని అరెస్ట్ చేసింది. వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేసిన తర్వాత పోలీసులు బూతు మాఫియా అంతా ఓ పెద్ద నెట్ వర్క్ కింద నడుస్తోందని ప్రకటించారు. వర్రా రవీంద్రారెడ్డికి కంటెంట్ రాఘవరెడ్డి నుంచి వచ్చిందని అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే ఇలాంటి పోస్టులు పెట్టారని బయట పెట్టారు. ఈ నెట్వర్క్ అంతా సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యం లో నడుస్తోందని ప్రకటించిన పోలీస్ లు భార్గవరెడ్డి అరెస్ట్ కు అరెస్ట్ చేసేందుకు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన విచారణకు హాజరు కావడం లేదు. తనకు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారు.

ముందస్తు బెయిల్ కోసం లోకల్ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి న్యాయమూర్తులు సహా వైసీపీని వ్యతిరేకించేవారందరిపై తప్పుడు ప్రచారాలు, అసభ్య పోస్టులు పెట్టించిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు.

సోషల్ మీడియా పోస్టుల పై అరెస్టులు ఆపడానికి వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది, అందులో భాగంగా హై కోర్ట్ లో పిల్ వేసిన విజయ్ బాబు అనే వైసీపీ నేతకు యాభై వేల జరిమానా విధించింది. అరెస్టు అయిన వారి విషయంలో సీరియస్ గా స్పందిస్తూండటంతో హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదని భార్గవరెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం హైకోర్టులోనే చెప్పుకోవాలని పంపేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *