“ఆపరేషన్ సింధూర్”………పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర క్యాంపులపై భారత్ అర్ధరాత్రి మెరుపు దాడి…….. 9 స్థావరాల ధ్వంసం

Operation sindhur

7th May 2025

పహాల్గమ్ దాడి జరిగి 12 రోజులైనా, ఇంకా భారత్ ఏ ప్రతీకార చర్య ఎందుకు తీసుకోలేదని భావిస్తున్న వేళ,భారత ప్రజానీకం

ఈ రోజు ప్రతి రాష్ట్రం లోను, సెక్యూరిటీ మాక్ డ్రిల్ నిర్వహించాలని, కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలిచ్చారు కాబట్టి, దీని తరువాత
మరి కొద్ది రోజుల్లోనే, భారత్ దాడులు చేస్తుందని, భారత ప్రజానీకం భావిస్తున్న వేళ, పాకిస్తాన్ ప్రభుత్వం తప్పుగా ఆలోచించిన వేళ

సెక్యూరిటీ మాక్ డ్రిల్ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి, ఆ డ్రిల్ తరువాతే, పాకిస్తాన్ పై ప్రతీకార దాడులు వుంటాయని, పాకిస్తాన్
భావించిన వేళ

ఈ రోజు తెల్లవారేసరికి భారత్ సాహసోపేతంగా , పహాల్గమ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, తీసుకున్న సైనిక చర్య భారత ప్రజలకు తెలిసింది.

పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని టెర్రరిస్టు కాంపులపై భారత్ దాడి చేసింది.మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దాటిన తరువాత, మే 7 న ఒంటిగంట న‌ల‌భై నాలుగు నిమిషాల స‌మ‌యంలో ఒక్క‌సారిగా పీఓకే లోని ఉగ్ర శిబిరాల‌పై మిసైళ్ళతో మెరుపుదాడి చేసి బాంబుల వర్షం కురిపించింది.

ఎప్పటినుండో , పీఓకే లో, పాకిస్తాన్ ఆర్మీ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్న ఉగ్ర క్యాంపుల్ని భారత వైమానిక దళం నేలమట్టం చేసింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 ఉగ్రవాదులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై భారత్ అధికారిక ప్రకటన చేసింది.

ల‌ష్క‌రే తోయిబా హెడ్ క్వార్ట‌ర్ మురిడ్కే, జైష్ ఏ మ‌హ‌మ‌ద్ కేంద్ర స్థానం బ‌హ‌వ‌ల్పూర్ లో ఈ దాడులు జ‌రిపింది. పాక్ ఆర్మీ సైతం ఈ దాడులు జ‌రిగిన‌ట్టు ప్ర‌క‌టించింది. 100 మంది ఉగ్రవాదులు మరణించారని భారత్ చెబుతూ ఉండగా, పాకిస్తాన్ సైన్యం మాత్రం, వారి పౌరులు ముగ్గరు మృతి చెందగా, 12 మంది క్షతగాత్రులయ్యారని ప్రకటించింది.

ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ చేసిన ఈ దాడుల తరువాత మన ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ అని ఎక్స్ లో, భార‌త్ మాతాకీ జై పోస్ట్ చేశారు.

భార‌త సైన్యం, “న్యాయం జ‌రిగింది. జైహింద్” అని ట్వీట్ చేసింది.

ఆపరేషన్ సింధూర్ పేరు తో జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్ లో పీవోకే లోని కొట్టి, ముజఫరాబాద్, బహవల్ పూర్ సహా మరికొన్ని ప్రదేశాలపై భారత్ సేనలు ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్స్ ను ప్రయోగించాయి.

అయితే ఇది ఆరంభం మాత్రమేనని..త్వరలో మరిన్ని దాడులు ఉంటాయని భారత్ ప్రకటించింది. ఉగ్రక్యాంపులపై పూర్తి ఖచ్చితమైన సమాచారంతోనే దాడులు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది

ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ చేసిన ఈ దాడులపై ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ భార‌త్ మాతాకీ జై అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. భార‌త సైన్యం న్యాయం జ‌రిగింది. జైహింద్ అని ట్వీట్ చేసింది.

కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేశామని, సామాన్య పౌరులపైన, పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేయలేదని భారత్ పేర్కొంది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ దాడులు చేస్తే, ప్రస్తుతానికి విరామం ఇచ్చిన , ఆపరేషన్ సింధూర్ మరలా కంటిన్యూ అవుతుందని భారత్, పాకిస్తాన్ ను హెచ్చరించింది.

భారత హిందూ మహిళల దాంపత్యానికి చిహ్నం అయిన, నుదుటన పెట్టుకునే సిందూరాన్ని, పాకిస్తాన్ ఉగ్రవాదులు చెరిపేసారు, ఆ ఉగ్రవాద చర్యకు ప్రతీకారంగానే, ఈ ఆపరేషన్ చేపట్టారు కాబట్టి, ఈ ఆపరేషన్ కు సిందూర్, అని పేరు పెట్టడం, చక్కగా అతికినట్టు సరిపోయిందని, భారత్ పౌరులు మోడీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *