కమల్ హాసన్ కు డీఎంకే నుంచి రాజ్యసభ ఎంపీ? విజయ్ కు చెక్ పెట్టేందుకేనా ?

rajyasabha mp for kamal hassan from DMK?

డీఎంకే మంత్రి పీకే శేఖర్ బాబు ప్రత్యేకంగా నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్‌ను కలవడం ఒక వార్త… దీంతో కొన్ని ఊహాగానాలు… కమలహాసన్‌కు డీఎంకే రాజ్యసభ సభ్యత్వం కట్టబోతోంది, అది మాట్లాడటానికి స్టాలిన్ తన మంత్రిని పంపించాడు అని…

కానీ తమిళ మీడియాలో ఇంతకుమించి ఊహాగానాలు కూడా కనిపిస్తున్నాయి… బహుశా అది డీఎంకేలో మక్కల్ నీది మయ్యం పార్టీని విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా కావచ్చునట…

 

 

 

గత ఎన్నికల్లో కమలహాసన్ ఇండికూటమికి మద్దతు పలికాడు… మరిప్పుడు అకస్మాత్తుగా నీకు ఎంపీ సీటు ఇస్తాం, నీ మద్దతు కొనసాగించు అని చెప్పాల్సిన అవసరం ఏముంది..?

హీరో విజయ్ దూకుడుగా ముందుకొస్తున్నాడు… తమిళగ వేట్రి కజగం… తనకూ రజినీకాంత్, కమలహాసన్ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది… ఎలాగూ జయలలిత మరణంతో అన్నాడీఎంకే పని అయిపోయింది… అందులో జనాకర్షణ ఉన్న లీడర్ లేడు… ఎవరికీ అంత సీన్ లేదు… సో, యాంటీ డీఎంకే వాక్యూమ్ ఉంది అక్కడ…

 

ఎలాగూ లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలను తన శిబిరంలోనే కట్టేసుకున్నాడు… తను ఎన్ని సీట్లు ఇస్తే అంతకే సంతృప్తి వాళ్లకు… అందుకని విజయ్ దూకుడును ఆదిలోనే అడ్డుకోవాలంటే సినిమా పాపులారిటీ ఉన్న లైక్ మైండెడ్ కమలహాసన్ పార్టీని విలీనం చేసుకుని, విజయ్‌ మీదకు ప్రయోగించాలనేది స్టాలిన్ ఎత్తుగడగా చెబుతున్నారు…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *