ఏబీ వెంకటేశ్వరరావు కు న్యాయం చేసిన, చంద్రబాబు ప్రభుత్వం

 

గత జగన్ ప్రభుత్వం, తనపై విధించిన అక్రమ సస్పెన్షన్ పై, 5 ఏళ్లు పోరాడిన సీనియర్ ఐపిఎస్ అధికారి A.B.వెంకటేశ్వరరావు కు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త నిచ్చింది. ఆయన పై, అప్పుడు పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఉపసంహరించుకుంది. కోర్టు ఆదేశాల ప్రకారం.. సస్పెన్షన్ కాలంలో పెండింగ్ లో ఉన్న జీత భత్యాలన్నీ ఇవ్వాలని నిర్ణయించి ఆ మేరకు జీత భత్యాలు విడుదల చేశారు. కు పూర్తి న్యాయం జరిగిందా అని తెలుసుకునే ముందు, అప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత A.B.వెంకటేశ్వరరావు పై, ఎందుకు, ఏ విధంగా కక్ష సాధింపులు చేసిందో తెలుసుకుంటే….

2015 లో, చంద్రబాబు సీఎం గా ఉండగా, వైసీపీ కి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లోకి వెళ్లిపోయారు. అప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్ గా వున్న , A.B.వెంకటేశ్వరరావు , ఈ వైసీపీ ఎమ్మెల్యేలను బెదిరించి, టీడీపీ లోకి వెళ్ళేటట్టుగా చేసారని, అధికారం లోకి రాకముందే జగన్ ఆరోపించాడు. అప్పటినుండే ఆయన మీద కక్ష పెంచుకున్నాడు జగన్.

 

2019 ఎన్నికలకు ముందే ఇంటెలిజెన్సు చీఫ్ గా వున్న A.B .వెంకటేశ్వరరావు ను తప్పించాలని, జగన్ కేంద్ర ఎన్నికల కమిషన్ కు కి లెటర్ రాసాడు. చంద్రబాబు అప్పటికే NDA నుండి బయటకు వచ్చేసి, కేంద్ర బీజేపీ మీద పోరాడుతున్నాడు. అందుకే, కేంద్ర బిజేపి నుండి జగన్ కు సహకారం లభించేందేమో, జగన్ లెటర్ రాయగానే, AB ని అప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల్లోనుండి తొలగించింది.

 

2019 లో వైసీపీ అధికారం లోకి వచ్చిన తరువాత ఆయనకు యే పోస్టింగ్ ఇవ్వకుండా వెంకటేశ్వర రావు ను పక్కన పెట్టారు. ఆరు నెలల తర్వాత, టీడీపీ హయాంలో ఫోన్ ట్యాపింగ్ డివైసెస్ కొనుగోలు చేసారని, దాన్లో అవకతవలు జరిగాయని, దేశద్రోహంచేశారనే ఆరోపణలతో ఆయన్ని సస్పెండ్ చేసారు. ఒక కేంద్ర సర్వీసుల అధికారిని సస్పెండ్ చేసేముందు పాటించాల్సిన ప్రోసిజర్ కూడా ఏమి ఫాలో అవలేదు, ఆయన్ని వివరణ కూడా అడగలేదు.

 

దీనిపై AB సుప్రీమ్ కోర్ట్ లో కేసు వేశారు. సుదీర్ఘంగా వాదనలు సాగాయి, కానీ ప్రభుత్వం ఆయన మీద ఆయనపై ఉన్న ఆరోపణలు ఏమిటో మాత్రం నిరూపించలేకపోయింది. చివరికి AB కు అనుకూలంగా , ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ ఆర్డర్ కాపీ తో , AB , చీఫ్ సెక్రటరీ ని కలుద్దామని వెళితే, CS జవహర్ రెడ్డి , ఆయనకు అప్పోయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు . AB డైరెక్ట్ గా సచివాలయం కు వచ్చినా, CS కలవకుండా ముఖం చాటేశాడు . దీనితో చేసేది లేక, అతని PA కు order copy ఇచ్చి Acknowledgement తీసుకున్నారు . ఇక తప్పక ఆయనికి ఒక అప్రాధాన్య శాఖ అయిన , తూనికలు కొలతలు శాఖ లో కమిషనర్ పోస్ట్ ఇచ్చారు. ఏది అయినా ప్రభుత్వం ఉద్యోగమే కదా అని, AB అక్కడ చేరారు.

 

ఏ శాఖ అయినా, ప్రజలకు సేవచేసేదే కదా అని, AB అక్కడ చేరారు. చేరిన కొద్ది కాలానికే, మొదట్లో, ఏ ఆరోపణలతో సస్పెండ్ చేశారో, మళ్ళా అవే, ఆరోపణలోతేనే 2 వారాల తరువాత రెండవసారి AB ని సస్పెండ్ చేసారు. రెండోసారి సస్పెండ్ చెయ్యకూడదు అనే ప్రొసీడింగ్స్ వున్నా, సస్పెండ్ చేసారు మళ్ళీ AB న్యాయ పోరాటం మొదలు పెట్టారు, రెండోసారి సస్పెండ్ చెయ్యడానికి సరి అయిన కారణాలు చూపలేదని , తన సస్పెన్షన్ ను సవాలు చేస్తూ, ఈ సారి cat(central administrative tribunal) లో ఫిర్యాదు చేసారు.

 

సుదీర్ఘంగా వాదనలు సాగాయి, కానీ ప్రభుత్వం ఆయన మీద ఆయనపై ఉన్న ఆరోపణలు ఏమిటో మాత్రం నిరూపించలేకపోయింది.
ఆయన గత నాలుగున్నరేళ్ల కాలంగా సస్పెన్షన్ లోనే ఉన్నారు. డీజీ ర్యాంకులో ఉన్న ఆయన ఇంత కాలం పోస్టింగ్ లేకుండా సస్పెండ్ లో ఉన్నారు CAT లో సుదీర్ఘంగా వాదనలు సాగాయి, కానీ ప్రభుత్వం ఆయన మీద ఆయనపై ఉన్న ఆరోపణలు ఏమిటో మాత్రం నిరూపించలేకపోయింది. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్.. రెండో సారి ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. అయితే 2024 సంవత్సరం మే 8 న , CAT AB కి అనుకూలంగా తీర్పు ఇస్తూ, ఆయన్ని రెండవసారి సస్పెండ్ చెయ్యడం కుదరదు, ఆయనకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.

 

CAT 2024, మే 8 కు ముందు, 20 రోజులు ముందు AB కి అనుకూలంగా తీర్పు ఇస్తే, ఆయనికి డీజీపీ పదవి వచ్చి ఉండేది. ఎందుకంటే , కేంద్ర ఎన్నికల కమిషన్ , ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ ని మార్చినపుడు, CS కు సీనియారిటీ ప్రకారం ముగ్గురు డీజీపీ పదవికి అర్హత వున్న పేర్లను పంపమని ఆదేశించింది. . అప్పటికే AB సస్పెన్షన్ చెల్లదు అని CAT తీర్పు వచ్చి ఉంటే, సీనియారిటీ ల అందరికన్నా మొదటి రాంక్ లో వున్న , AB పేరు పంపాల్సి వచ్చేది. దురదృష్టవశాత్తు, ఆ తీర్పు ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త డీజీపీ ని ఎన్నికల కమిషన్ నియమించిన తరువాత వచ్చింది.

 

CAT లో AB కి అనుకూలంగా తీర్పు ఇచ్చినా, జగన్ ప్రభుత్వం కావాలనే మే 30 దాకా యే నిర్ణయం తీసుకోకుండా సాగదీసింది. ఎందుకంటె, 2024 మే 31 న AB రిటైర్ అవుతున్నారు. ఆయన వుద్యోగం లో ఉండగా రిటైర్ అవ్వకూడదు అనే పట్టుదలతో వుంది ప్రభుత్వం. ఆయనికి ఒంటిమీద యూనిఫామ్ ఉండకూడదు, గౌరవపరమైన నిష్క్రమణ ఉండకూడదు అనే పట్టుదలతో వుంది. ఆ సమయంలో, కోడ్ అఫ్ కండక్ట్ వుంది కాబట్టి మాములుగా అయితే, CS, EC కి పంపించాలి, అయితే CS పరిధి దాటి, EC కి పంపించకుండా, సీఎం కు పంపించాడు. పంపడానికి CS కు అధికారం లేదు, అప్పీల్ కు వెళ్ళండి అనే అధికారం సీఎం కు లేదు. అయినా పట్టించుకోకుండా , CAT ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలని , మళ్ళా హై కోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు, హై కోర్టు కు ఏబీ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇక గత్యంతరం లేక, అప్పటి cs జవహర్ రెడ్డి, రిటైర్మెంట్ ఆఖరి రోజు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం అధిపతిగా పోస్టింగ్ ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వం విధించిన అక్రమ సస్పె న్షన్ పై సుదీర్ఘం గా న్యా య పోరాటం చేసి విజయం సాధిం చిన ఏబీ వెంకటేశ్వ రరావు, డీజీపీ కేడర్ లో రిటైర్ అవ్వాల్సిన ఏబీ, మే 31 న అంటే ఆయన సర్వీ సులో చివరితేదీ ఉదయం విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటి గ్ అండ్ స్టేషనరీ ప్రాంతీయ కార్యా లయంలో బాధ్యతలు చేపట్టి.. సాయం త్రానికే పదవీ విరమణచేశారు. ఆరోజు ఆయన అభిమానులు, ఉద్యో గులు భారీగా తరలివచ్చి ఏబీ కి ఘనంగా వీడ్కో లు పలికారు. ఐపీఎస్ అధికారిగా ఆయన చేసిన సేవలు, ధైర్య సాహసాలను పలువురు కొనియాడారు. సీనియర్ ఐపీఎస్ , ఆర్టీసీ ఎండీ ద్వా రకా తిరుమలరావు, ఐఏఎస్ అధికారి చెరుకూరి శ్రీధర్ , తెదేపా నేత పట్టాభి, అమరావతి ఐకాస నేతలు సహా పలువురు ఐపీఎస్ లు, ఐఏఎస్ లు ఏబీవీని కలిసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు యూనిఫాం తో ఉన్న ఏబీవీ ఫొటోపై ఫైటర్ అని రాసిన ప్లకార్డులను ఆయన అభిమానులు ప్రదర్శిం చారు. “అన్యాయాన్ని ఎదురిస్తూనే ఉం టా..రిటైర్ అయినా జీవితాంతం ప్రజాసేవలోనే వుంటానని, సర్వీసులో ఉన్నన్ని రోజులు నీతి.. నిజాయతీతో పనిచేశా. పూర్తి సంతృ ప్తితో పదవీ విరమణ చేస్తున్నా, వృత్తి రీత్యా ఎంతోమం దిని చూశాను. నేను చేసిన పోరాటం చూసి.. ఎన్నో లక్షల మం ది స్పం దించారు, వారందరికీ రుణపడి ఉంటా. నా బాధ, పోరాటం , నిజాయతీ ఎంతో మందికి దగ్గర చేశాయి. ఈరోజు వృత్తిరీత్యా మాత్రమే రిటైరవుతున్నా. చివరి శ్వాస వరకు అన్యాయాన్ని ఎదురిస్తూనే ఉంటా, బాధితుల తరఫున పోరాడుతూనే ఉంటా’’ అని ఏబీవీ తన రిటైర్మెంట్ వీడ్కోలు సభలో తెలిపారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక, ఆయనక ఏదైనా మంచి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని, ఎంతో మంది టిడిపి కార్యకర్తలు,అభిమానులు ఆశించారు. ఇంతవరకు, ఆయనకు ఏ పదవి ఇవ్వలేదు. అయితే, ఈ రోజు, అబ్ సస్పెన్షన్ కాలంలో పెండింగ్ లో ఉన్న పూర్తి జీత భత్యాలన్నీ ఇవ్వాలని నిర్ణయించడం , ఆయన మీద పెట్టిన కాసులు ఎత్తేయడంతో, ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు . ఇక ఆయనకు మంచి నామినేటెడ్ పదవి ఇస్తే , ఆయనకు పూర్తి న్యాయం జరగినట్టు అవుతుంది అని ఆయన అభిమానులు మరియు టిడిపి అభిమానులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *