జగన్ ప్రభుత్వం చంద్రబాబు పై పెట్టిన సిఐడి కేసులను సిబిఐ కు బదిలీ చేయాలన్న పిటిషన్ కొట్టివేత

Jagan government's petition to transfer CID cases against Chandrababu to CBI dismissed

జగన్ సీఎంగా ఉండగా, చంద్రబాబు పై మొదట స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టాడు, నంద్యాల దగ్గర పర్యటనలో వుండి , బస్సులో విశ్రాంతి తీసుకుంటున్న , చంద్రబాబును , ఏ నోటీసు లు లేకుండా, FIR కాపీ , ఏ ప్రాధమిక ఆధారాలు కూడా చూపించకుండా, అరెస్ట్ చేసారు, ఆ కేసులో చంద్రబాబు ను రాజమండ్రి జైల్లో 5౩ రోజులు జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో చంద్రబాబు , ఈ కేసులో బెయిల్ పై బయటకు వచ్చెయ్యకుండా, మరి కొన్ని కేసు లు పెట్టి, వాటి మీద PT వారెంట్స్ పెట్టి, మరికొంత కాలం జైల్లో పెట్టే కుట్ర చేసాడు, కానీ జగన్ పన్నాగం పారలేదు.

చంద్రబాబు పై జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు

ఆ కేసులు ఏమిటంటే, ఫైబర్నేట్ కేసు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ మార్పు కేసు, సాండ్ పాలసీ కేసు, మద్యం పాలిసీ పై కేసు, అంగళ్ళు హత్యా ప్రయత్నం కేసు. ఈ కేసు లన్నిటిలో చంద్రబాబు కు AP హైకోర్ట్ పూర్తి బెయిల్ ఇచ్చింది. ఫైబర్నేట్ కేసు లో బెయిల్ మాత్రం ఇప్పటికీ సుప్రీమ్ కోర్ట్ లో పెండింగ్ లో ఉంది.

అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు లో అరెస్ట్ అయి జైల్లో ఉండగా, మొదట కంటి ఆపరేషన్ నిమిత్తం మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు, ఆ బెయిల్ మీదుండగానే పూర్తి రెగ్యులర్ బెయిల్ పొందాడు. ఆ బెయిల్ కేన్సిల్ చెయ్యాలని, జగన్ పట్టుదలగా సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ వేసాడు. ఆ పిటిషన్ సుప్రీమ్ కోర్ట్ లో ఉండగానే, 2024 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. , వైసీపీ ని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చిత్తుగా ఓడించారు, చంద్రబాబు ను అకారణంగా జైల్ లో పెట్టడం కూడా జగన్ ఓటమికి ఒక కారణం.

అయితే, అధికారం పోయినా, సీఎం అయిన చంద్రబాబు, ఎక్కడ తన కేసులను , ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ లో కొట్టేయించుకుంటాడో అనే భయం లేదా అక్కసు కొద్దీ జగన్ , హైకోర్టు న్యా యవాది బి.బాలయ్యతో, “చంద్రబాబు పై వున్నఅన్ని కేసులు , సిబిఐ కి బదిలీ చెయ్యాలని” సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ వేశారు. “చంద్రబాబు సీఎం కాబట్టి, ఈ కేసుల్లో తన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కాబట్టి, సిబిఐ కి బదిలీ చేయలని “, ఆ పిటిషన్ లో పేర్కొన్నారు

కేంద్రం లో బీజేపీ ఉంది , ప్రస్తుతం కేంద్ర బీజేపీ ప్రభుత్వం , చంద్రబాబు మద్దత్తు పైనే ఆధారపడి ఉంది, దాని వల్ల ఈ కేసులు సిబిఐ కి ఇచ్చినా, సిబిఐ ఎటువంటి చర్యలు తీసుకోదు, అని జగన్ కు తెలిసినా, సిబిఐ కు ఎందుకు బదిలీ చెయ్యాలని కోరుకున్నాడంటే, సిబిఐ కి ఇస్తే, అప్పుడు చంద్రబాబు పిలక బీజేపీ చేతిలో ఉంటుంది, బీజేపీ ఈ సిబిఐ కేసులు అడ్డుపెట్టుకుని, చంద్రబాబు ని ఆడిస్తుంది, అలాగే, చంద్రబాబు మద్దత్తు తమకు కావాల్సినా, కేసులుండటం వలన, ఆంధ్ర ప్రదేశ్ కు చంద్రబాబు ఏమడిగినా బీజేపీ ఇవ్వలిసిన అవసరం ఉండదు, దాని వలన చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ కు ఏమి అభివృద్ధి చెయ్యలేడు, అప్పడు టీడీపీ ఆంధ్ర ప్రదేశ్ లో దెబ్బతింటుంది, పరోక్షంగా అది జగన్ కు మేలు చేస్తుంది, అని భావించారు.

కానీ జగన్ వేసిన కుట్రలన్నీ విఫలం అయ్యాయి. హైకోర్టు అడ్వకేట్ బి.బాలయ్య వేసిన , ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది.

తీర్పు సందర్భంగా

“ఇది పూర్తిస్థాయిలో తప్పుడు పిటిషన్ అని జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని ధర్మా సనం ఆగ్రహం వ్య క్తం చేసింది. పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది హెచ్చ రిం చారు. బాలయ్య తరఫున వాదనలు వినిపిం చడానికి సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సిద్ధమవగా.. ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా? అని ధర్మా సనం తీవ్ర అసహనం వ్య క్తంచేసిం ది. ఇలాంటి కేసుల్లో కూడా మీలాంటి సీనియర్లు హాజరవుతారని అసలు ఊహించలేదని వ్యాఖ్యానించింది. ఒక్క మాట కూడా మాట్లాడొద్దంటూ”, పిటిషన్ ను సుప్రీం కోర్టు డిస్మి స్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *