టీడీపీ కార్యకర్త, యూట్యూబర్ చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యల కేసు లో అరెస్ట్, ఏ పార్టీ వారైనా ఉపేక్షించం, ప్రభుత్వం హెచ్చరిక

10th April 2025.

 

టీడీపీ కార్యకర్త, యూట్యూబర్ చేబ్రోలు కిరణ్ మీద గుంటూరు లో కేసు పెట్టారు, అతన్ని ఇబ్రహీం పోలీస్ లు అరెస్ట్ కూడా చేసారు.

ఏమి జరిగింది ?

ఈ యూట్యూబర్ చేబ్రోలు కిరణ్, ఐటీడీపీ సభ్యుడు, యూట్యూబ్ లో టీడీపీ కి అనుకూలంగా వీడియో లు పెడుతూ ఉంటాడు, వైసీపీ ని విమర్శిస్తూ, వైసీపీ నేతలు చేసే కామెంట్లకు కౌంటరు ఇస్తూ ఉంటాడు, అయితే, ఇన్నాళ్లు పరిధి దాటలేదు, కానీ ఈసారి ఏమైందో కానీ, తన పరిధి దాటాడు. మొన్న రాప్తాడు లో, జగన్ పోలీస్ లను బట్టలు విప్పిస్తాను, వాళ్ళ యూనిఫామ్ లను పీకి, ఉద్యోగాలనుండి తొలగిస్తాను అని చేసిన కామెంట్స్ పై, పాయింట్ బ్లాంక్ లో కౌంటర్ వీడియో చేసాడు, ఆ వీడియో లో మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ,సతీమణి వైఎస్‌ భారతి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసాడు.

ఆ తరువాత తన తప్పు గ్రహించినట్టున్నాడు, ఆ వీడియో ను , ఆ ఛానల్ లోనుండి డిలీట్ చేసాడు, వై.స్. భారతి కి క్షమాపణలు చెబుతూ వీడియో చేసాడు. అయితే, అప్పటికే ఆ వీడియో సర్కులేట్ అయిపొయింది. ఆ ఆడియో సోషల్ మీడియా లో లీక్ అయిపొయింది. ఆ ఆడియో పట్ల వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి, చేబ్రోలు కిరణ్ ను వెంటనే అరెస్ట్ చేయలని డిమాండ్ చేసాయి.

రాజకీయ నాయకులను విమర్శించవచ్చు, కానీ రాజకీయాలతో సంభందం లేని , ఇంట్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని చంద్రబాబు ఎప్పుడో ప్రకటించారు. ఏ పార్టీ అయినా కేసు లు పెడతామని, అరెస్ట్ చేస్తామని చెప్పారు. అందుకే తమ పార్టీ ఇమేజ్ కు భంగం కాకుండా, ప్రభుత్వం తక్షణమే స్పందించింది, కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతనిపై కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో పోలీసులు కిరణ్‌పై కేసు నమోదు చేశారు. గురువారం, గుంటూరులో కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.

పాయింట్ బ్లాంక్ టీవీ లో, తన అసభ్యకర కామెంట్ల ఆడియో సోషల్ మీడియా లో సర్క్యులేట్ అయ్యాక, తన తప్పును గుర్తించిన చేబ్రోలు కిరణ్ తర్వాత ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు కోరాడు . “నా మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నాను. ఎలాంటి ఉద్దేశంతో తాను ఈ వ్యాఖ్యలు చేయలేదని.. క్షణికావేశంలో చేశారని క్షమించండి” అంటూ వీడియో విడుదల చేశారు.

అసలు ఇక్కడ అర్ధం కానిది, ఇక్కడ క్షణికావేశం ఎలా అవుతుందో అర్ధం కాదు, ఎవ్వరైనా, లైవ్ లో మాట్లాడుతూ, నోరు జారితే , సరే అని అర్ధం చేసుకోవచ్చు , కానీ ఒక వీడియో తయారుచేసి న తరువాత , ఆ వీడియో ను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు, తాను మాట్లాడిన మాటలు, అసభ్యకరమైనవి, నేరమని, గుర్తించలేదా ? వీడియో అప్లోడ్ చేసే ముందు గుర్తించలేదా ? అంత అయిపోయాక, నేను తప్పు చేశాను, క్షమాపణలు చెబుతున్నాను అంటే కుదురుతుందా? రేపు ప్రతి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ,చంద్రబాబు, లోకేష్ ల పై అసభ్యకరమైన కామెంట్స్ పోస్ట్ చేసి, తరువాత క్షమాపణలు చెబుతూ వీడియో చేస్తు ఉంటే, టీడీపీ అభిమానులు సహించగలరా ?

వైసీపీ అధికారం లో వున్నపుడు, ఏ వల్లభనేని వంశీ , చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై చేసిన అసభ్యకరమైన కామెంట్లకు, టీడీపీ అభిమానులు ,కార్యకర్తలు ఆగ్రవేశాలతో రగిలిపోయారో, ఆ వంశీ చేసిన అవే కామెంట్స్ , టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు ఎలా చేస్తారు, చేద్దామనుకున్నారు ?

వైసీపీ కి 11 ప్రజలు ఇచ్చారంటే, వారి ఎమ్మెల్యేల ,మంత్రులు ,అసభ్య కరమైన మాటలు, బూతులు సహించలేకే కదా. మరి అదే తప్పు టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు చేస్తే, ఎలాగ ? కొంతమంది టీడీపీ కార్యకర్తల అత్సుత్సాహం , టీడీపీ ఓటమికి దారి తీస్తుందని గ్రహించి, మిగతా కార్యకర్తలు, సోషల్ మీడియా లో ఇంటర్వ్యూ లు, వీడియో లు చేసేటప్పుడు, స్పృహ లో వుండి పని చేస్తే, పార్టీ కి మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *