టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన కొలికపూడి

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు , టీడీపీ అధికస్థానానికి, ఒక అల్టిమేటం ఇచ్చారు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ రమేష్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, దీనికి 48 గంటల టైం ఇస్తున్నానని, అలా సస్పెండ్ చెయ్యకపోతే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. టీడీపీ హై కమాండ్ కే , ఆల్టిమేటం ఇచ్చిన మొదటి ఎమ్మెల్యే అయి సంచలం సృష్టించారు.

కొలికపూడి 2019 దాక పెద్దగా ఎవరికీ తెలియదు, 2014 నుండి 2019 దాక సాక్షి ఛానెల్ డిబేట్ లకు వెళ్లి, చంద్రబాబు ను విమర్శించేవారంటారు, కానీ ఆ వీడియో లు పెద్దగా నెట్ లో దొరకడం లేదు. ఆంధ్రప్రదేశ్ వాసే అయినా, హైదరాబాద్ లో వుంటారు, అక్కడ ఒక ఐఏఎస్ అకాడమీ నడుపుతూ వుంటారు.

తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ లో చాలా మంది IAS, IPS లకు సెలెక్ట్ అయి, ఆంధ్ర ప్రదేశ్ లో పని చేస్తున్నారు అని చాలా సార్లు డిబేట్ లలో చెప్పారు.

2019 నుండి ABN, TV5 డిబేట్ లలో, ఆ 5 ఏళ్ళు, జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం ద్వారా హై లైట్ అయ్యారు, టీడీపీ క్యాడర్, అభిమానులు కూడా ఆయనను తమ పార్టీ కి ఓన్ చేసుకున్నారు, ABN, TV5 డిబేట్ ల ద్వారా బాగా పాపులర్ అయిన కొలికపూడి అమరావతి రైతుల ఉద్యమానికి కూడా మద్దత్తు తెలిపారు, చంద్రబాబు దృష్టిలో పడ్డారు, చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా వున్నపుడు కూడా కొని సార్లు చంద్రబాబు ను కలిసాను అని , కొన్ని డిబేట్ లలో చెప్పారు.

తిరువూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో 1994 నుంచి నల్లగట్ల స్వామిదాసు టీడీపీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.. 2024 ఎన్నికల ముందు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ని విడిచి వైసీపీ లో చేరినపుడు, ఈ స్వామిదాసు కూడా కేశినేని నాని వెంట వైసీపీలో చేరడంతో టీడీపీకి తిరువూరు లో పోటీ చెయ్యడానికి అభ్యర్ధి లేకుండా పోయారు. దాంతో అప్పుడు విజయవాడ టీడీపీ ఎంపీ గా పోటీ చేస్తున్న , కేశినేని నాని సోదరుడు , కేశినేని చిన్ని , తిరువూరు కి, టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి పేరు అధిష్టానానికి సిఫార్సు చేశారు. అదివరకే కొలికిపూడి పై మంచి అభిప్రాయం ఉండటంతో, చంద్రబాబు వెంటనే అంగీకరించి, అతనికి తిరువూరు టీడీపీ టికెట్ ఇచ్చారు.

అక్కడ ఎన్నో ఏళ్ళనుండి వున్న టీడీపీ క్యాడర్ కు కొలికిపూడి తో పరిచయం లేకపోయినా, స్థానికుడు కాకపోయినా, చంద్రబాబు ఆదేశాలకు తలవొగ్గి, కొలికపూడి విజయానికి బాగా కృషి చేసారు, టీడీపీ కూటమి వేవ్ కూడా బాగా కలిసొచ్చి, తిరువూరు లో కొలికపూడి మంచి మెజార్టీతో గెలిచారు.

అయితే, గెలిచినప్పటినుండి, కొలికపూడి కి అక్కడ వున్న టీడీపీ క్యాడర్ తో పడక, ఎన్నో వివాదాల్లో నిలుస్తూ వచ్చారు.

ఒక అక్రమణదారు , అక్రమంగా కట్టిన ఇల్లు కూల్చడానికి , అధికారులకు ఫిర్యాదు చేయకుండా, తానే జేసీబీ లను తీసుకుకెళ్లి వివాదం లో నిలిచారు.

ఏ ABN ఛానల్ డిబేట్ ల ద్వారా తాను పాపులర్ అయ్యాడో, ఆ వారికే చెందిన ఆంధ్రజ్యోతి విలేఖరి తన గురించి తప్పుగా వార్తలు రాసాడని, ఆ విలేఖరిని బెదిరించడం , విమర్శించడంతో, అప్పటినుండి ABN, కొలికాపుడిని డిబేట్ లకు పిలవడం మానేసింది.

ఎన్నో వివాదాలతో, కొలికపూడి టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారారు.

తాజాగా, మాజీ ఏఎంసీ ఛైర్మన్ రమేష్‌రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని దీనికి 48 గంటల టైం ఇస్తున్నానని, అలా సస్పెండ్ చెయ్యకపోతే, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.. ఓ గిరిజన మహిళ పై లైంగిక వేధింపుల ఆడియో ఇటీవల సంచలనంగా మారింది. ఆ గిరిజన మహిళను వేధించిన రమేష్ రెడ్డి పైచర్యలు తీసుకోవాలంటూ హెచ్చరించారు.

శనివారం ఉదయం 11 గంటలతో కొలికపూడి డెడ్ లైన్ పూర్తి అయింది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొలికపూడి తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. ఇప్పటికే ఐవిఆర్ఎస్, ముగ్గురు సభ్యులతో కూడిన నివేదికను టీడీపీ అధిష్టానం తెప్పించుకుందని తెలుస్తోంది.

48 గంటల గడువు ముగియడంతో, తిరువూరు లో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా, తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో పోలీసుల భారీగా మోహరించారు.

కొలికపూడి తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. ఇప్పటికే ద్వారా మరియు ముగ్గురు సభ్యులతో కూడిన నివేదికను అధిష్టానం తెప్పించుకుందంట.

తిరువూరు టీడీపీ క్యాడర్ మరో మాట చెబుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, రమేష్‌రెడ్డిని, కొలికపూడి , కొంత సొమ్ము అప్పుగా సాయం చేయమని కోరితే, రమేష్‌రెడ్డి దానికి నిరాకరించడంతో, దానికి ఆగ్రహించిన కొలికపూడి రమేష్ రెడ్డి ని ఎలాగైనా తప్పించాలని, ఈ నాటకం మొదలెట్టారని , ఓ ప్రచారం నడుస్తోంది.

ఈ లోగా, తిరువూరు టీడీపీ కార్యవర్గం , టీడీపీ అధిష్టానాన్ని కలిసి , కొలికపూడితో మేము పని చెయ్యము, ఆయన్ని తప్పించాలని కోరుతోంది. టీడీపీ అధిష్టానం , అంత సాహసం చేసి, మరో రఘురామ రాజుని తయారు చేస్తుందా అని చూడాలి.

ఎక్కడ లేని సమస్యలు తిరువూరు లోనే ఎందుకు వస్తున్నాయని , చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారని, ఛానళ్లలో స్క్రోలింగ్ న్యూస్ వచ్చింది.

ఒకటి మాత్రం ఖాయంగా కనపడుతోంది, 2029 ఎన్నికల దాకా ఊరుకుని, అప్పుడు కొలికపూడి కి టికెట్ ఇవ్వకపోవడం ద్వారా , అతన్ని పక్కన పెడతారేమో అని అనిపిస్తోంది.

ఒకటి మాత్రం నిజం, రాజకీయాల్లో వున్న వాళ్ళు ఎక్కువ కాలం కొనసాగాలంటే, లౌక్యం, సహనం ముఖ్యం. వ్యక్తిగా మంచివాడైనా
ఎమ్మెల్యే గా అయిన తరువాత కొలికపూడి లో లో ముందు చెప్పుకున్న లక్షణాలు లోపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *