బసవతారకం ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీగా తాను వుండాలన్న కలలు కల్లలు అయ్యాయి, లక్ష్మి పార్వతికి.

Telangana High court gave shock to Lakshmi Parvathi

లక్ష్మి పార్వతి కి తెలంగాణ హైకోర్ట్ లో షాక్ తగిలింది. బసవతారకం మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని సిటి సివిల్ కోర్టు , ఆమెకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు తెలంగాణ హై కోర్ట్ కొట్టివేసింది.

అసలు ఏమి జరిగింది అంటే, బసవతారకం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా తనను నియమించాలని, అందుకు సాక్ష్యంగా, బసవతారకం ట్రస్ట్ కు ఎన్టీఆర్ అదివరకే రాసిన విల్లు కు అనుబంధంగా , మరో అదనపు విల్లు ఎన్టీఆర్ 1995 నవంబర్ 18న ఎన్టీఆర్ రాసారని, సిటి సివిల్ కోర్ట్ కు అందజేసింది. అయితే, దానికి సాక్షిగా జె. వెంకట సుబ్బయ్య సంతకం పెట్టారని, ఇప్పుడు ఆ వెంకట సుబ్బయ్య బ్రతికి లేరు, కానీ, ఆ వెంకట సుబ్బయ్య, అతని కుమారుడు జెవి ప్రసాదరావు కు, ఈ వీలునామా మాట చెప్పారు కాబట్టి, తన పిటిషన్ కు ఆధారంగా ఈ జెవి ప్రసాదరావు చేత కోర్ట్ లో సాక్ష్యం చెప్పించింది. ఆ సాక్ష్యాన్ని అంగీకరించిన , సిటి సివిల్ కోర్టు , బసవతారకం మేనేజింగ్ ట్రస్టీగా లక్ష్మి పార్వతి ని నియమించాలని , ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

అయితే, ఈ తీర్పు పై, ఎన్టీఆర్ కుమారులు బాలకృష్ణ, హరికృష్ణ లు హైకోర్టులో, 2009 లో సవాల్ చేశారు.

ఇన్నాళ్లకు తెలంగాణ హై కోర్ట్, ఈ కేసు లో తీర్పు చెప్పింది.

హై కోర్ట్ లక్ష్మి పార్వతి కి , అనుకూలంగా సిటీ సివిల్ కోర్ట్ ఇచ్చిన తీర్పు కొట్టివేసింది.

తీర్పు కొట్టివేస్తూ హై కోర్ట్ ఏమి వ్యాఖ్యానం చేసిందంటే,

“1995 నవంబర్ 18న ఎన్టీఆర్ రాసిన సప్లిమెంటరి విల్లు చెల్లదు, ఈ సప్లిమెంటరీ విల్లును నిరూపించే క్రమంలో సిటి సివిల్ కోర్టు చట్టబద్దంగా వ్యవహరించలేదు, విల్లుపై మొదటగా, సాక్షి సంతకం చేసిన జె. వెంకట సుబ్బయ్య చనిపోయినా, అతని వారసుడు మరియు , కుమారుడు అయిన జెవి ప్రసాదరావు ను, సాక్షిగా పేర్కొంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా చట్టవిరుద్ధం, సాక్షి సంతకం చేసిన జెవి ప్రసాదరావు , కనీసం తన తండ్రి డెత్ సర్టిఫికేట్ కూడా సిటి సివిల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, అయినప్పటికీ దిగువ కోర్టు ప్రసాదరావు నోటి మాట ఆధారంగా సాక్షిగా పరిగణలో తీసుకొంది, కాబట్టి , ఇచ్చిన తీర్పు చెల్లదు “.

మొత్తానికి, బసవతారకం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా తాను వుండాలన్న కలలు కలలు అయ్యాయి, లక్ష్మి పార్వతికి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *