2nd April 2025.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం , సిస్కో తో కలిసి చేబట్టబోయే, ప్రోజెక్టులలోనుండి ఇప్పాల ను సిస్కో సంస్థ పక్కన పెట్టింది.
ఎవరీ ఇప్పాల , ఏమి ఘనకార్యం చేసాడు, దీనికి ముందు ఆర్టికల్ లో చెప్పబడింది, అది కూడా చదివితే
విషయం అవగతమవుతుంది.
జగన్ సీఎంగా వున్నపుడు, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి , తెలుగుదేశం పార్టీ, లోకేష్, చంద్రబాబు పై సోషల్ మీడియా లో అసభ్యంగా పోస్టులు పెట్టాడు, సోషల్ మీడియా లో మాములుగా ఇతను పెట్టే పోస్టులలో అతని ప్రొఫైల్ ఫోటో పెట్టడు , అందుకనే అతను ఎలాగుంటాడో మాములుగా అయితే తెలియదు, కానీ టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు కనిపెట్టేసారు, అతను సిస్కో బృందం తో కలిసి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి చెయ్యబోయే ప్రాజెక్ట్ MOU చెయ్యడం గురించి, గత నెల 25న, IT Minister లోకేష్ ను కలిసాడు, షేక్ హేండ్ కూడా ఇచ్చాడు ఒక అరగంట గడిపాడు. అదెలా అంటే.. . ఈ ఇప్పాల సిస్కో కంపెనీ లో సౌత్ ఇండియా టెరిటరీ అక్కౌంట్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు . అతను లోకేష్ తో ఫోటో లు కూడా దిగాడు. . అయితే ఇప్పాల రవిచంద్రారెడ్డి ఎవరన్నది లోకేష్ కు అప్పటికి తెలిసే అవకాశం లేదు. అతను కూడా కంపెనీ ప్రతినిధే కాబట్టి, అతనితో మాట్లాడాడు.
అయితే ఆ ఫొటోలు సోషల్ మీడియాలో రాగానే ఇప్పాల చరిత్ర అంతా బయటపడింది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలపైనా ఇప్పాల ఎంత విషం చిమ్మాడో , టీడీపీ సోషల్ మీడియా అభిమానులు , వివరంగా బయటపెట్టేశారు. ఇలాంటివాడితో లోకేష్ ఎలా కలుస్తారు , అని లోకేష్ పైనా విమర్శలు గుప్పించారు. లోకేష్ కు తెలియకపోవచ్చు, కానీ, ఒక మంత్రిగా లోకేష్ ను కలిసే, కంపెనీ బృదం లో ఏ సభ్యులు వున్నారు, వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి, ఇది చెక్ చేసుకోవాల్సిన భాద్యత , మంత్రి లోకేష్ పేషీ లో అధికారులు తెలుసుకోవాలిగా, కానీ వారు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం తో, వారి ఫెయిల్యూర్ కు, లోకేష్ విమర్శలు ఎదుర్కోవలిసి వచ్చింది.
టీడీపీ సోషల్ మీడియా ద్వారా, ఈ విషయం, వెంటనే లోకేష్ దాకా వెళ్ళింది, దానికి త్వరగానే లోకేష్ రియాక్ట్ అయ్యారు.
సిస్కోకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ విధమైన ప్రాజెక్టులోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కాఇప్పాలను భాగస్వామిని చేయవద్దంటూ లేఖ రాశారు. ఆ లేఖలో ఇప్పాల వైసీపీ హయాంలో వ్యవహరించిన తీరును సోదాహరణంగా వివరించారు. వ్యాపార ఒప్పందాలకూ రాజకీయాలకూ సంబంధం లేదని పేర్కొంటూనే.. ఒక రాజకీయ పార్టీతో అంటకాగుతూ, ప్రభుత్వ వ్యతిరే కతను ప్రచారం చేస్తున్న వ్యక్తిని ఏపీ ప్రాజెక్టులలో భాగస్వామిగా అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీంతో సిస్కో కూడా అంతే వేగంగా రియాక్ట్ అయ్యింది. ఇప్పాల రవిచంద్రారెడ్డిని ఏపీ ప్రాజెక్టుల నుంచి తొలగించింది. ఆ మేరకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. అంతే కాకుండా లోకేష్ లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ సిస్కో ఇప్పాలను, ఏపీకి చెందిన అన్ని ప్రాజెక్టుల నుంచీ తొలగించినట్లు లోకేష్ పేషీకి అధికారికంగా సమాచారం అందించింది.
అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రాజెక్టులోనూ ఇప్పాలను భాగస్వామిగా ఉంచరాదని సిస్కో నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకు ఏపీ మంత్రి లోకేష్ లేఖ రాసిన తరువాత సిస్కో బృందం తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఓ ఒప్పందంపై సంతకాలు చేసే కార్యక్రమానికి ఇప్పాలను పక్కన పెట్టడమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో , స్కిల్స్ యూనివర్సిటీ, సిస్కో మధ్య MOU కుదిరింది. ఆ కార్యక్రమంలో సీఎం తో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ , శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు, సిస్కో సీనియర్ వైఎస్ ప్రసిడెంట్ డాక్టర్ గయ్ డీడ్రిక్ గై డైడ్రిచ్, ఆ సంస్థ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. అంటే ఒక్క ఇప్పాల రవిచంద్రారెడ్డి తప్ప.. ఏపీ సర్కార్ తో భేటీ సమయంలో ఉన్న బృందం అంతా కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమానికి ఇప్పాలను సిస్కో పక్కన పెట్టేయడం, ఇప్పుడు ఏపీ ప్రాజెక్టుల నుంచి ఇప్పాలను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం చూస్తుంటే తెలుగు రాష్ట్రాలలో సిస్కో ప్రాజెక్టుల నుంచి ఇప్పాలకు ఆ సంస్థ ఉద్వాసన చెప్పినట్లేనని పరిశీలకులు అంటున్నారు.
అయితే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో, ఇప్పాల , లేనంత మాత్రాన అతనికి నష్టం ఏమిటి ? మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటాడు. అతన్ని, ఉద్యోగంలోనుండైతే సిస్కో తీసెయ్యలేదు కదా.
అసలు నారాలోకేష్ ఏమి చేసివుండవలిసింది అంటే, ఇప్పాల ను, ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్టుల్లో తొలగించాలని, సిస్కో కు , ఇమెయిల్ పంపినప్పుడే , ఈ ఇప్పాల గతం ఏమిటో , అతను సోషల్ మీడియా లో ఎలాటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాడో, అవి కూడా జత చేయవలిసింది, అలాగే, అతని మీదున్న కేసు వివరాలు, గతం లో అతను ఏ కేసు మీద అరెస్ట్ అయ్యాడో, ఆ కేసు వివరాలు కూడా తెలియపరచి, అతని ప్రవర్తన నైతికంగా మంచిది కాదు , అతన్ని వుద్యోగం లోకి తీసుకున్నప్పుడు, సిస్కో వాళ్ళు, అతని బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసి వుండవలిసింది, అని వారికి ఒక సూచన కూడా ఇచ్చి ఉన్నట్టు అయితే, సిస్కో కంపెనీ, అతన్ని , మొత్తానికే కంపెనీ నుండి వెళ్లగొట్టే అవకాశం ఉండేది. అప్పుడు ఈ ఇప్పాల చేసిన తప్పుడు పనులకు కొంతమేర అతనికి శిక్ష పడినట్లయేది.