2nd March 2025
IPS పీ వీ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, అయన నిందితుడుగా వున్న, రఘురామ రాజు కస్టోడియల్ టార్చర్ కేసు లో కాదు, IPS సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేసిన అంశంలో.
అసలు పీవీ సునీల్ కుమార్ మీద 2019 వరకు ఎటువంటి ఆరోపణలు లేవు. చంద్రబాబు 2014 నుండి 2019 వరకు సీఎం గా వున్నపుడు, ఈయన అప్పటి సీఎం చంద్రబాబు నుండి అవార్డులు తీసుకున్నారు.
ఎటువంటివారైనా వైసీపీ తో జతకట్టిన తరువాత, వైసీపీ కి అనుకూలంగా పని చేసిన తరువాత, వారు వివాదాల్లో చిక్కుకోవడం, అధికార దుర్వినియాగం ఆరోణల్లో చిక్కుకోవడం పరిపాటిగా మారిపోయింది.
2019 లో , జగన్ సీఎం అయిన తరువాత సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారిని అన్న సంగతిని మర్చిపోయి వైసీపీకి సర్వీస్ చేసి ఘోరమైన తప్పులు చేశారనే ఆరోపణలు వున్నాయి.
టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల పై ఇష్టం వచ్చినట్టు కేసు లు పెట్టడం, వారిని థర్డ్ డిగ్రీ చేశారనే ఆరోపణలు వున్నాయి.
వెంగరావు అనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూ లలో చెప్పాడు. టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ కూడా ఆయనను ఒక కేసు లో శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధించినట్లు చెప్పాడు.
స్వయానా ఒక ఎంపీ అయిన రఘురామరాజును, అయన పుట్టినరోజు నాడే, హైదరాబాద్ నుండి విజయవాడ లాక్కొచ్చి, సీఐడీ పోలీస్ స్టేషన్ లో రాత్రంతా ఉంచి, ఇంటరాగేషన్ పేరుతో, ఆయన్ని చిత్రహింసలు పెట్టి, థర్డ్ డిగ్రీ చేసినట్టు , రఘురామ రాజే సునీల్ కుమార్ మీద కేసు పెట్టాడు, ఈ కస్టోడియల్ టార్చర్ కేసు లో పీ వీ సునీల్ కుమార్ నిందితుడిగా కేసు పెట్టారు, కోర్ట్ విచారణలో ఆ కేసు వుంది.
ఈ కేసు లో ఆయన్ని సస్పెండ్ చెయ్యాలని, రఘురామ రాజు ఎప్పటినుండో కోరుతున్నారు, అదే నెరవేరకపోవడంతో , రఘురామరాజు పలు సందర్భాలలో తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడం కూడా జరిగింది.
ఇన్నాళ్లకు అయన కోరిక నెరవేరినట్టుగా సునీల్ కుమార్ పై ఇప్పుడు సస్పెన్షన్ విధించడం జరిగింది.
ఆయన సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేసినట్లుగా గుర్తించారు.
ఓ సారి స్వీడన్, మరోసారి దుబాయ్ రహస్యంగా వెళ్లి వచ్చారు. ప్రభుత్వ వర్గాలకు సమాచారం ఇవ్వకుండా ఆయన ఈ పర్యటనలకు ఎందుకు వెళ్లారన్న దానిపై ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి.
IPS సర్వీస్ నిభందనల ప్రకారం, ఒక IPS అధికారి వ్యక్తిగత సెలవు మీద అయినా, విదేశాలకు వెళ్ళేటప్పుడు, ఏ దేశానికి వెళ్తున్నారో దానికి అనుమతులు కోరాలి, అనుమతి లేకుండా వెళ్ళకూడదు, అలాగే అనుమతించిన దేశానికే వెళ్ళాలి తప్ప ,అనుమతించని దేశాలకు వెళ్ళకూడదు.
క్రింద ఆయన చేసిన విదేశీ పర్యటన వివరాలు వున్నాయి చూడండి . ఆయన్ని ఎందుకు సస్పెండ్ చేసారో తెలుస్తుంది.