మహేష్ బాబు కు ఈడీ నోటీసులు……..

enforcement directorate gave notices to maheshbabu

22nd April 2025

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఈడీ (Enforcement Directorate) నోటీసులు జారీ చేసింది… 27న విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించింది…

మహేష్ బాబు కు నోటీసు లు ఇచ్చారంటే, మహేష్ బాబు, అంత పెద్ద నేరం చేశాడా, లేదా అంటే, ఈ నోటీసు లకు ముందు ఏమి జరిగిందో తెలియాలి. .

హైదరాబాద్‌లో సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ , అనే రియల్ ఎస్టేట్ సంస్థలు అక్రమాలకు పాల్పడినట్లుగా పై ఫిర్యాదులు వచ్చాయి, దానితో, పోలీసులు ఆ సంస్థల పై కేసు నమోదు చేశారు.

 

ఆ సంస్థలపై ఆరోపణలు ఏమిటంటే……

ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు , మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు చేశారనీ, అంటే, ఒక్క ఫ్లాట్ నే నలుగురు, ఐదుగురుకు అమ్మడం, జనానికి అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు అమ్మడం , ఇలాంటి అక్రమాలు చేసారని.  వందల కోట్లలో వీరు ఫ్రాడ్ చేసినట్లుగా పోలీసులు, పేర్కొన్నారు. ఈ కేసు లో ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ప్రవేశించారు, ఈడీ కేసులు నమోదు చేసారు, ఈ సంస్థలు చేసిన ఆర్ధిక అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.

 

వీటికి మహేష్ బాబు కు సంభందం ఏమిటి ?

ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు వ్యవహరిస్తున్నాడు.

ఈ సంస్థలపై కేసు లు నమోదు చేసిన తరువాత, ఆ సంస్థలకు చెందిన కార్యాలయాలు, వాటి యజమానులకు సంబంధించిన ఇళ్లల్లో, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ ఇళ్లల్లో , మహేష్ బాబుకు సాయి సూర్య డెవలపర్స్ సంస్థ రూ.5 కోట్ల 90 లక్షలు చెల్లించినట్లుగా డాక్యూమెంట్స్ దొరికాయి.
ఇందులో రూ.3 కోట్ల 40 లక్షలు చెక్కుల రూపంలో.. మిగిలిన రెండున్నర కోట్ల నగదు రూపంలో చెల్లించారు.

 

అయితే, ఆ సంస్థలకు ప్రచారం చేసి డబ్బు తీసుకుంటే తప్పేమిటి , 

ఆ రియల్ ఎస్టేట్ సంస్థలు అక్రమాలు చేసాయి కాబట్టి, దానికి ప్రచారకర్త గా మహేష్ బాబు వ్యవహారిస్తున్నాడు కాబట్టి, పైగా మహేష్ బాబు కు, 2 .5 కోట్లు నగదు రూపం లో చెల్లించడం , అంత డబ్బు నగదు రూపంలో చెల్లించడం చట్ట రీత్యా నేరం. ఈ నగదు చెల్లింపుకు, మనీలాండరింగుకు లింక్ ఉందని ఈడీ సందేహం, అందుకే విచారణకు రమ్మని మహేష్ బాబు కు నోటీసు ఇచ్చారు. ప్రచారం కోసం ఆ డబ్బు తీసుకున్నాడు కాబట్టి ఈడీ తననూ ఈ కేసుల్లోకి చేర్చింది.

ఇలాంటి మోసపూరిత సంస్థలకు ప్రచారం చేస్తే వారు చేసే అక్రమాలకు ఈ సెలెబ్రిటీ లు జవాబుదారీలే అవుతారు. ఈ మధ్యే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి, కొంతమంది సెలెబ్రిటీలు ఇరుక్కున్నారు కదా, ఇదీ అటువంటి నేరమే…

ఆ సంస్థలు అక్రమాలు చేస్తున్నాయని నాకెలా తెలుస్తుంది అంటే కుదరదు, అందుకే ఏ వస్తువుకైనా , ఏ సంస్థకైనా ప్రచారానికి ఒప్పుకునే ముందు, అన్ని కోణాల్లో అలోచించి, ఎక్సపర్ట్స్ సలహాలు తీసుకుని, ప్రచారం చేస్తే, భవిష్యత్తులో చట్టపరంగా ఏ ఇబ్బంది తలెత్తదు.

ఇప్పటికే మహేశ్ బాబు గుట్కాల సరోగేట్ యాడ్స్ చేయడం మీదే చాలా మంది విమర్శలు ఉంటే, ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రచారం చేసినందుకు విమర్శలే కాదు, కేసు లు కూడా ఎదుర్కొనే ప్రమాదం వుంది., ఈడీ నిందితుల జాబితాలోకి వచ్చే అవకాశం వచ్చింది. …

ఆ మధ్యే అల్లు అర్జున్ అరెస్టు ఇష్యూ తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ కి ఒక షాక్ అయితే, ,ఇప్పుడు ఇది మరో షాక్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts